etechlooks

Daily Latest news Channel

Breaking

Tuesday, April 16, 2019

నా పేరు చదవగానే.. ఆనందం తట్టుకోలేకపోయా: విజయ్ శంకర్

ఐసీసీ ప్రపంచకప్‌కి వెళ్లే 15 మంది ఆటగాళ్ల జాబితాను బీసీసీఐ సోమవారం ప్రకటించింది. అయితే ప్రపంచకప్‌ ఆడే భారత జట్టులో నెం.4 స్థానంలో ఎవరు బ్యాటింగ్‌కి వస్తారనే విషయంలో కాస్త స్పష్టత వచ్చినట్లే కనిపిస్తోంది. ఆస్ట్రేలియాతో స్వదేశంలోనూ, విదేశంలోనూ జరిగిన వన్డే సిరీస్‌లో నిలకడగా రాణించిన విజయ్ శంకర్‌కు బీసీసీఐ ప్రపంచకప్ జట్టులో చోటు కల్పించింది. దీంతో నెం.4 స్థానంపై ఉన్న ఉత్కంఠకు దాదాపు తెరపడినట్లు అయింది.

అయితే తనకు ప్రపంచకప్ జట్టులో చొటు దక్కిందని తెలిసి చాలా సంతోషించానని శంకర్ పేర్కొన్నాడు. ‘‘నా సెలక్షన్ గురించి నాకు కొంత స్పష్టం ఉంది. నేను టీవీ ముందు కూర్చొని ప్రకటన కోసం ఎదురుచూస్తున్నా. ఒక్కసారిగా నా పేరు చదవగానే ఆనందం తట్టుకోలేకపోయాను. టోర్నమెంట్‌లో జట్టు కోసం పూర్తిస్థాయిలో కష్టపడతాను. విరాట్ కోహ్లీ సారథ్యంలో ఆడటం మరింత సంతోషంగా ఉంది. ఈరోజుతో నా కల నెరవేరింది. ఇది ప్రపంచకప్‌లో నా ఆరంగేట్రం. నాకు ఎంతో ఉత్సాహంగా ఉంది. దీన్ని ఇంకా నమ్మలేకున్నా’’ అని శంకర్ తెలిపాడు.

టీం ఇండియా జట్టు: విరాట్ కోహ్లీ(కెప్టెన్), రోహిత్ శర్మ, శిఖర్ ధవన్, కేఎల్ రాహుల్, విజయ్ శంకర్, ఎంఎస్ ధోనీ, కేదార్ జాదవ్, దినేశ్ కార్తీక్, యుజవేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, హార్థిక్ పాండ్యా, మహ్మద్ షమీ.

The post నా పేరు చదవగానే.. ఆనందం తట్టుకోలేకపోయా: విజయ్ శంకర్ appeared first on DIVYAMEDIA.



from DIVYAMEDIA http://bit.ly/2GnB2XD

No comments:

Post a Comment