ఈరోజుల్లో నాన్ వెజ్ లేనిదే ముద్ద దిగలేని పరిస్థితి. ఏ కార్యక్రమం, వింధు, ఇంట్లో చిన్న చిన్న పార్టీలు చేసుకున్న నాన్ వెజ్ తప్పని సరి అయిపోయింది కదా! అయితే ఎక్కువగా ఇష్టపడే మాంసా ప్రియులకు ఇది కాస్తా నిరాశ కలిగించే వార్తే! నిత్యం మాంసాహారం తినేవారు అకాల మరణం తప్పదంటున్నారు పరిశోదకులు. 42 నుండి 60 సంవత్సరాలు వయస్సు గల 2700 మంది స్త్రీ పురుషుల మీద పరిశోదకులు సుదీర్ఘకాలం పాటు అధ్యయనం చేశారు. అయితే వీరిలో సగం మంది ప్రతిరోజూ 76 గ్రాముల మాంసం తీసుకునే అలవాటు ఉంది. ఇక మిగతా వారిలో సగం మంది 76 గ్రాముల కన్నాకొంచెం తక్కువ తక్కువ మాంసం తీసుకుంటారు. మిగతా వారు వారంలో ఒకటి లేదా రెండురోజులు మాత్రమే మాంసం తీసుకుంటారు.
అధ్యయనకాలం ముగిసే సమయానికి వీరిలో 1200 మంది మృత్యుబారిన పడ్డారు. వీరిలో 40 శాతం మంది ప్రతిరోజూ మాంసాహారం తీసుకునేవారున్నారు. కేవలం మాంసాహారం తీసుకోవడం వలనే వీరు అకాల మృత్యు వాత పడినట్లు అధ్యయనకారులు వెల్లడించారు. నిత్యం కాకుండా వారంలో ఒకటిరెండు సార్లు మాంసాహారం తీసుకోవడం వలన ఎలాంటి ప్రాణ నష్టం ఉండదని పరిశోదకులు స్పష్టం చేస్తున్నారు.
The post మాంసాహార ప్రియులకు హెచ్చరిక.. ఇది తెలిస్తే మళ్ళీ తినరు..ఎందుకంటే ….? appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA http://bit.ly/2Hf7axc
No comments:
Post a Comment