కార్గిల్‌లో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. అడవి నుంచి జనావాసాల్లోకి చొరబడ్డ ఓ ఎలుగుబంటిపై కొందరు రాళ్లతో దాడి చేశారు. దీంతో అది ఓ కొండపై నుంచి నీటి కాలువలో పడిపోయింది. తీవ్ర గాయాలపాలైన ఎలుగు జాడ కోసం అటవీశాఖ అధికారులు గాలింపు చేపట్టారు. 8 సెకన్ల నిడివి గల ఈ హార్ట్ బ్రేకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వివరాలు.. సమీప గ్రామంలో చొరబడ్డ ఓ ఎలుగుబంటిని గ్రామస్తులు తరిమారు. అది వారి బారినుంచి తప్పించుకుని ఓ నీటి కాలువలోకి చేరింది. అక్కడ నుంచి కొద్దిదూరం వెళ్లి గట్టుకు చేరేందుకు కొండనెక్కడం మొదలుపెట్టింది.
అయితే, పైనుంచి ఓ అల్లరిమూక దానిపై రాళ్లతో దాడికి దిగారు. ఈ క్రమంలో పట్టు కోల్పోయిన ఎలుగు అంతెత్తు పైనుంచి కిందపడింది. తీవ్ర గాయాలతో నీటిలో పడి కొట్టుకుపోయింది. మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ఈ ఘటనను ఖండించారు. నిందితులను గుర్తించి శిక్షించాలని డిమాండ్ చేశారు. కార్గిల్ డిప్యూటీ కిమషనర్ బసీరుల్ హక్ చౌదరీ ఘటనపై విచారణలకు ఆదేశించారు. రాళ్లు విసిరిన వారిని పట్టుకునేందుకు చర్యలు ప్రారంభించామని, ఎలుగు జాడ కనుగొనేందుకు అటవీశాఖ అధికారులకు సమాచారామిచ్చామని వెల్లడించారు.
The post కార్గిల్‌లో అమానవీయ ఘటన చోటుచేసుకుంది, హార్ట్ బ్రేకింగ్ వీడియో..! appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA http://bit.ly/2LDsP6C
No comments:
Post a Comment