కోట్లాది మంది ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన 2019 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఎట్టకేలకు నిన్న వచ్చిన సంగతి మన అందరికి తెలిసిందే..ఈ ఎన్నికలలో ఎవ్వరు ఊహించని విధంగా వైసీపీ పార్టీ ఏకంగా 151 సీట్లు కొల్లగొట్టి చరిత్ర తిరగ రాసింది..టీడీపీ ,జనసేన పార్టీలకు మాత్రం ఘోరా పరాభవం ఎదురు అయింది..ఎన్నికలలో గెలుపు కోసం కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టిన తెలుగు దేశం పార్టీ కి కేవలం 23 సీట్లు మాత్రమే రాగ…జీరో బడ్జెట్ పాలిటిక్స్ తో సరికొత్త రాజకీయాలకు తేరా లేపడానికి ప్రయత్నీమ్చినా జనసేన పార్టీ కేవలం ఒక్క స్థానం కి మాత్రమే పరిమితం అయ్యింది..పవన్ కళ్యాణ్ కూడా గాజువాక ,భీమవరం నుండి ఓడిపోవడం ని అభిమానులు జీర్ణించుకోలేక ఉన్నారు..మరో పక్క నారా లోకేష్ కూడా మంగళగిరి లో ఇంటికి ఒక్క AC పంచిన కూడా గెలవలేకపోవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది..నిన్నటి ప్రజా తీర్పు ఎవ్వరు ఊహించనిది..మర్చిపోలేనిది
ఈ ఎన్నికలలో జనసేన పార్టీ ఘోర పరాజయం పాలివ్వడానికి ముఖ్య కారణం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ని క్షేత్ర స్థాయి నుండి నిర్మించకపోవడమే..క్యాడర్ ని నిర్మించకపోవడం..5 సంవత్సరాలు సంపూర్ణంగా రాజకీయాల్లో ఉండకుండా సినిమాలు చెయ్యడం వంటి కారణాల వల్ల పవన్ కళ్యాణ్ సొంత అభిమానులే చాల మంది ఓట్లు వెయ్యలేదు..లోపాలనంటిని సరిదిద్దుకోవడానికి పవన్ కళ్యాణ్ జూన్ 1 నుండే కార్యాచరణ ప్రారంభించబోతున్నారు..అన్ని జిల్లాల జనసేన పార్టీ కార్యకర్తలతో ఆయన ఈ జూన్ ౧వ తేదీన చర్చలు జరపబోతున్నారు..అంటే కాకుండా ప్రత్యేక హోదా అంశం పై ఆయన ఏ ఏడాది చివర్లో ఆమరణ నిరాహార దీక్ష చేయబోతున్నట్టు సమాచారం..ఇటీవలే జగన్ కూడా ప్రత్యేక హోదా సాధ్యపడదు అని చెప్పిన సంగతి మన అందరికి తెలిసిందే..మరి భవిష్యత్తు లో పవన్ ధాటిని జగన్ ఎదురుకోగలరా?? పవన్ కళ్యాణ్ 5 సంవత్సరాలు జనం లోనే ఉంటే వైసీపీ పార్టీ ఆ ప్రభంజనం లో కొట్టుకుపోనుందా?? ఏమో కాలమే ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి
ఇక జగన్ ముఖ్య మంత్రి అయ్యాడు అని తెలియగానే అందరూ అతనికి శుభాకాంక్షలు వెల్లువ లా కురిపించారు..జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా మరి కొద్దీ సేపట్లో ప్రెస్ మీట్ పెట్టి జగన్ కి శుభాకాంక్షలు తెలియ చేసే అవకాశాలు ఉన్నాయి అని విశ్వసనీయ వర్గాల సమాచారం..మరి పవన్ కళ్యాణ్ ఏమి మాట్లాడుతాడో అని అభిమానులు అందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు..ఇక పోతే ఇప్పుడు రాష్ట్రమంతటా ఎక్కడ చూసిన జగన్ అభిమానులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు..ఈ నెల 30 వ తారీఖున జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు..మరి ఇన్ని రోజులు చంద్ర బాబు నాయుడు పాలనని చూసిన ప్రజలు జగన్ పాలన ఎలా ఉంటుందో కూడా చూద్దాం..ఏది ఏమైనా ఈరోజు ఇచ్చిన ప్రజా తీర్పు అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది..ప్రజల నాడిని పట్టుకోవడం అంత సులభం ఐన విషయం కాదు అని మరోసారి నిరూపితమైనది
The post Breaking News: జూన్ 1 వ తేదీన జగన్ గుండెల్లో బాంబు పేల్చే ప్రకటన చెయ్యబోతున్న పవన్ కళ్యాణ్ appeared first on Tollywood Superstar.
from Tollywood Superstar http://bit.ly/2JED7Sa
via IFTTT

No comments:
Post a Comment