etechlooks

Daily Latest news Channel

Breaking

Friday, May 3, 2019

Chandrayaan-2: జులై 9-16 మధ్య చంద్రయాన్-2 ప్రయోగం! - isro's chandrayaan-2 likely to land on moon on september 6 | Etechlooks

Chandrayaan-2: జులై 9-16 మధ్య చంద్రయాన్-2 ప్రయోగం! – isro’s chandrayaan-2 likely to land on moon on september 6 చంద్రయాన్-2 ప్రయోగానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ అంతా సిద్ధం చేస్తోంది. చంద్రయాన్‌-2 ప్రయోగాన్ని జులై 9 నుంచి 16 మధ్య చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు ఇస్రోవర్గాలు పేర్కొన్నాయి. ఈ తేదీల్లో ప్రయోగం చేపడితే సెప్టెంబరు 6 నాటికి చంద్రుడి ఉపరితలం వద్దకు చంద్రయాన్-2 చేరుతుందని అంచనా వేస్తున్నారు. అయితే, ఈ ప్రాజెక్టుకు సంబంధించి ప్రయోగ కేంద్రం వద్ద చాలా పనులు పెండింగ్‌లో ఉన్నట్టు పేర్కొన్నాయి. చంద్రయాన్‌-2లో 3 మాడ్యూల్స్‌ ఆర్బిటర్‌, ల్యాండర్‌ (విక్రమ్‌),రోవర్‌ (ప్రాగ్యాన్‌) ఉన్నాయి. చంద్రయాన్ గురించి ఇస్రో ఛైర్మన్ కే శివన్ మాట్లాడుతూ… ‘దీనిని జీఎస్‌ఎల్వీ మార్క్ 3 రాకెట్ ద్వారా ప్రయోగించిన తర్వాత చంద్రుడి కక్ష్యకు చేరుకుంటుంది. అనంతరం ఆర్బిటర్‌ నుంచి విక్రమ్ ల్యాండర్‌ విడిపోయి దక్షిణ ధ్రువం దగ్గరగా దిగుతుంది. అందులో నుంచి ప్రాగ్యాన్ రోవర్‌ బయటకు వచ్చి 300 నుంచి 400 కిలోమీటర్ల మేర పయనించనుంది. అక్కడే 14 రోజులపాటు ఉండి చంద్రుడి ఉపరితలాన్ని వివిధ కోణాల్లో పరిశీలించనుంది. అక్కడ పరిస్థితులకు సంబంధించిన సమాచారం, ఫోటోలను 15 నిమిషాల్లో ఈ రోవర్ పంపనుంది’ అని వివరించారు. అలాగే ఇందులో 13 పేలోడ్స్ ఉంటాయని, వీటిలో మూడు ప్రాగ్యాన్ రోవర్‌లోనూ, మిగతా 10 ల్యాండర్, ఆర్బిటర్‌లో‌ను అమర్చనున్నట్టు తెలిపారు. వాస్తవానికి దీనిని గతేడాది ఏప్రిల్‌లో ప్రయోగించాల్సి ఉండగా, 2019 జనవరికి వాయిదా వేశారు. కానీ, చంద్రయాన్‌-2 డిజైన్లలో పలు మార్పులు చోటు చేసుకోవడంతో ప్రయోగంలో మరింత ఆలస్యమైంది. చంద్రయాన్‌-2లో ల్యాండర్‌తో పాటు రోవర్‌ ఉంటుంది. ల్యాండర్‌ చంద్రుడిపై దిగితే రోవర్‌ దాని చుట్టూ తిరుగుతూ పరిశోధనలు చేయనుంది. ఫిబ్రవరిలో రోవర్‌, ల్యాండర్‌ను పరీక్షించారు. ఈ సమయంలో ల్యాండర్‌ బరువును మోసేలా కాళ్లు బలంగా లేకపోవడంతో విరిగిపోయినట్లు శాస్త్రవేత్తలు అప్పట్లో భావించారు. ఏప్రిల్‌ నాటికి ల్యాండర్‌ సిద్ధం కాకపోవడంతో మే నెలలో ప్రయోగం నిర్వహించలేకపోయారు. తాజాగా, దీనిని జులై 9 నుంచి 16 మధ్య చేపట్టనున్నట్టు ఇస్రో ప్రకటించింది. ఇస్రో ప్రయోగం విజయవంతమైతే చంద్రుడిపైకి రాకెట్‌ను పంపిన నాలుగో దేశంగా నిలుస్తుంది. చంద్రుడిపైకి తొలిసారిగా భారత్ 2008 అక్టోబరు 22న చంద్రయాన్‌ను పంపింది. అయితే, అప్పుడు కేవలం ఆర్బిటర్ మాత్రమే పంపారు. ఇది చంద్రుడి ఉపరితలంపై దిగి అనే చిత్రాలను తీసింది. The post Chandrayaan-2: జులై 9-16 మధ్య చంద్రయాన్-2 ప్రయోగం! – isro’s chandrayaan-2 likely to land on moon on september 6 appeared first on Etechlooks. http://bit.ly/2Jee0Vg

No comments:

Post a Comment