తెల్ల రేషన్ కార్డు దారులందరికి సెప్టెంబర్ 1వ తేదీ నుంచి సన్నబియ్యం పంపిణి చేయాలనీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడాది సెప్టెంబర్ 1వ తేదీ నుంచి అన్ని రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తాం. రేషన్ పంపిణీలో వినూత్న మార్పులు తీసుకువచ్చి కల్తీ లేని బియ్యాన్నిఅందిస్తాం. సన్న బియ్యం పంపిణీ కోసం ప్రభుత్వంపై వెయ్యి కోట్లు భారం పడుతుంది అని పౌర సరఫరాల శాఖమంత్రి కొడాలి నాని చెప్పారు. కేంద్రం నుంచి వస్తోన్న బియ్యంలో 25 శాతం నూక వస్తోందని, దీనిని వండితే అన్నం ముద్దగా మారుతోందని అన్నారు.
రేషన్ పంపిణీలో వినూత్న మార్పులు తీసుకువచ్చి కల్తీ లేని బియ్యాన్నిఅందిస్తామని హామీ ఇచ్చారు. సెప్టెంబర్ 1 నుంచి అన్ని రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తామని, దీనికోసం 6 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరమవుతాయని పేర్కొన్నారు. సన్న బియ్యం పంపిణీ కోసం ప్రభుత్వంపై వెయ్యి కోట్లు భారం పడుతుందన్న మంత్రి బియ్యం సేకరణకు అవలంభించాల్సిన విధానాలపై చర్చించి సరైన నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.
The post సన్నబియ్యం పంపిణీకి నమూనా సంచులు సిద్ధం appeared first on Tollywood Superstar.
from Tollywood Superstar http://bit.ly/2X11iwe
via IFTTT
No comments:
Post a Comment