సోమవారం తెల్లవారుజామున 2.51 నిమిషాలకు తలపెట్టిన జీఎస్‌ఎల్‌వీ-3 ఎం–1 రాకెట్‌లో మూడో దశలో సాంకేతిక లోపం కారణంగా చంద్రయాన్-2 ప్రయోగాన్ని అర్ధాంతరంగా నిలిపివేశారు. ఆదివారం ఉదయం 6.51 నిమిషాలకు ఇస్రో చైర్మన్ డాక్టర్ శివన్ ఆధ్వర్యంలో కౌంట్‌డౌన్ ప్రారంభించారు. ప్రయోగానికి 56.24 నిమిషాల ముందుగా అంటే1.55 గంటలకు కౌంట్‌డౌన్ ప్రక్రియ అర్ధాంతరంగా ఆగిపోయింది.
అయితే ‘చందమామ రావే.. జాబిల్లి రావే..’ అని నెలరాజును పిలవడం కాదు..! మరోసారి చంద్రుని రహస్యాలు తెలుసుకొనే ప్రయోగం జరిగింది. కానీ అనూహ్యంగా చంద్రయాన్-2 అర్ధంతరంగా ఆగిపోయింది. బాహుబలి రాకెట్ జీఎస్‌ఎల్వీ మార్క్3 ఎం1 ద్వారా అర్ధరాత్రి దాటిన తర్వాత (సోమవారం తెల్లవారుజామున) 2.51 గంటలకు చంద్రయాన్-2ను ప్రయోగించేందుకు సిద్దం చేశారు.‘జీఎస్‌ఎల్వీ మార్క్3’లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ముందుజాగ్రత్త చర్యగా ఈ ప్రయోగాన్ని నిలిపివేసినట్లు ఇస్రో ప్రకటించింది. ప్రయోగ సమయానికి సరిగ్గా 56 నిమిషాల 24 సెకన్ల ముందు కౌంట్‌డౌన్ నిలిచిపోయింది. ఆ తర్వాత కొద్ది నిమిషాలకే చంద్రయాన్-2 ప్రయోగ ప్రత్యక్ష ప్రసారాన్ని కూడా ఆపేశారు.
మళ్లీ ఈ ప్రయోగాన్ని ఎప్పుడు చేపట్టేది తర్వాత ప్రకటిస్తామని ఇస్రో అధికారులు తెలిపారు. చంద్రయాన్-1 ద్వారా తొలి ప్రయత్నంలోనే జాబిల్లి కక్ష్యకు ఆర్బిటర్‌ను ఇస్రో విజయవంతంగా చేరవేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు చంద్రయాన్-2లో ఆర్బిటర్‌తోపాటు అక్కడి ఉపరితలంపై దిగే ల్యాండర్, రోవర్లు ఉన్నాయి. ఈ ప్రయోగానికి సంబంధించి ఆదివారం ఉదయం 6.51 గంటలకు షార్‌లో కౌంట్‌డౌన్ ప్రారంభమైన విషయం తెలిసిందే. షెడ్యూలు ప్రకారం ఈ ప్రయోగం జరిగింటే.. జీఎస్‌ఎల్వీ రాకెట్ 16.13 నిమిషాలు రోదసిలోకి పయనించి 181 కిలోమీటర్ల ఎత్తులో చంద్రయాన్-2 కాంపోజిట్ మాడ్యూల్‌ను వదిలి పెడుతుంది. దీంతో ప్రయోగం మొదటి దశ ముగుస్తుంది. ఆపై ఈ మాడ్యూల్ రోదసిలో 54 రోజులపాటు పయనించి సెప్టెంబరు 6న ఆర్బిటర్ నుంచి విక్రమ్ ల్యాండర్ వీడి చంద్రుడిపై దిగుతుంది.
అనంతరం ల్యాండర్ నుంచి ప్రగ్యాన్ రోవర్ వెలుపలికి వచ్చి చంద్రుడి ఉపరితలంపై పరిశోధనలు ప్రారంభిస్తుంది. 14 రోజులపాటు ఈ ల్యాండర్, రోవర్లు చంద్రుని ఉపరితల రహస్యాలను శోధించి ఆ సమాచారాన్ని భూ కేంద్రాలకు పంపనున్నాయి. ఆర్బిటర్ మాత్రం ఏడాదిపాటు చంద్ర కక్ష్యలో పరిభ్రమిస్తూ పరిశోధనలు చేయనుంది. చంద్రయాన్-2లో మొత్తం 13 పేలోడ్స్ ఉన్నాయి. ఆర్బిటర్‌లో 8, విక్రమ్ ల్యాండర్‌లో 3, ప్రగ్యాన్ రోవర్‌లో 2 ఉన్నాయి. వీటిల్లో ఐదు పేలోడ్స్ మన దేశానికే చెందినవి కాగా మూడు యూరప్, రెండు అమెరికా, ఒకటి బల్గేరియా దేశానికి చెందినవి. ఈ ప్రయోగానికి ఇస్రో రూ.978 కోట్లు ఖర్చు చేస్తోంది. రూ.375 కోట్లతో రాకెట్‌ను, రూ.603 కోట్లతో ఆర్బిటర్, ల్యాండర్, రోవర్లను ఇస్రో తయారు చేసింది.
The post చివరి నిమిషాల్లో చంద్రయాన్- 2 ఆగిపోవడానికి అసలు కారణం ఏంటో తెలుసా …? appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA https://ift.tt/32CvFx8
No comments:
Post a Comment