ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లాలోని పట్టణం తిరుపతి. ఈ పట్టణాన్ని ఆనుకొని ఉన్న కొండలపై వెంకటేశ్వర స్వామి ఆలయం ఉన్న వూరు తిరుమల. ఈ రెండింటినీ కలిపి “తిరుమల తిరుపతి” అని వ్యవహరిస్తూ ఉంటారు. తిరుమల వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని ప్రతిదినం లక్ష నుండి రెండు లక్షల వరకు భక్తులు సందర్శిస్తుంటారు. ప్రత్యేక దినాలలో 5 లక్షలమంది వరకూ దర్శనం చేసుకొంటారు,. ఈ యాత్రాస్థలం శ్రీవైష్ణవ సంప్రదాయంలోని 108 దివ్యదేశాలలో ఒకటి.
అయితే తిరుమల వెంకన్న ఆలయంలో ఇకపై వీఐపీల పోటు తగ్గుతుందా? సామాన్య భక్తులకు స్వామి దర్శనం సాఫీగా సాగుతుందా? శ్రీవారి సన్నిధిలో ఎల్1, ఎల్2, ఎల్3 పేరిట ఉన్న ప్రస్తుత వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దుచేస్తామని, వీఐపీలు ఏడాదికొకసారే రావాలని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించిన నేపథ్యంలో సర్వత్రా వినిపిస్తున్న సందేహాలివి. మరి వీఐపీల పరిస్థితి ఏంటి? వారి వర్గీకరణ ఎలా జరుగుతుంది? వీఐపీలకు టీటీడీ చేయబోయే ప్రత్యామ్నాయ దర్శనం ఎలా ఉండబోతుంది? అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. తిరుమల ప్రత్యేకాధికారి ధర్మారెడ్డి గతంలో కొండపైన పనిచేసనప్పుడు లఘు, మహాలఘు దర్శనాలను ప్రవేశపెట్టారు. అదేవిధంగా వీఐపీ బ్రేక్ దర్శనాలను వారి విచక్షణ అధారంగా కేటాయించేవారు. ఎల్1, ఎల్2, ఎల్3 అంటూ ప్రత్యేకమైన విభజనలేదు.
శ్రీనివాసరాజు జేఈవోగా వచ్చాకే ‘ఎల్’ దర్శనాలకు శ్రీకారం చుట్టారు. తాజాగా టీటీడీ ఛైర్మన్ ప్రకటనతో మళ్లీ ధర్మారెడ్డి హయాంలోని ప్రక్రియే ఉంటుందని భావిస్తున్నారు. కొందరు టీటీడీ ఛైర్మన్ నిర్ణయాన్ని స్వాగతిస్తూనే సాధ్యాసాధ్యాలపై పూర్తిగా అధ్యయనం చేయాలంటున్నారు. మరికొందరు వీఐపీ దర్శనాలతో శ్రీవారికి వచ్చే ఆదాయాన్ని ఎందుకు వదులుకోవాలని అంటున్నారు.
The post తిరుమల వెంకన్న ఆలయంలో వీఐపీని ‘బ్రేక్’ దర్శనాలా విధానంలో కొత్త నిర్ణయం : టీటీడీ ఛైర్మన్ appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA https://ift.tt/2SgWTVm
No comments:
Post a Comment