etechlooks

Daily Latest news Channel

Breaking

Friday, July 26, 2019

మళ్ళి బాట్ పట్టిన యువరాజ్, అవుట్ కాకున్నా క్రీజు వదిలివెళ్ళిన యువరాజ్, వీడియో.

1981, డిసెంబర్ 12 న చండీగర్ లో జన్మించిన యువరాజ్ సింగ్ భారత దేశపు క్రికెట్ క్రీడాకారుడు. భారత మాజీ బౌలర్ మరియు పంజాబీ సినీ నటుడు అయిన యోగ్‌రాజ్ సింగ్ కుమారుడైన యువరాజ్ సింగ్ 2000 నుంచి వన్డే క్రికెట్ లో, 2003 నుంచి టెస్ట్ క్రికెట్|టెస్ట్ క్రికెట్ లో భారత జట్టులో ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇతను ప్రస్తుతం 2007 ప్రపంచ కప్ క్రికెట్లో ఇంగ్లాండుకు చెందిన స్టూవర్ట్ బ్రాడ్ ఓవర్‌లో వరుసగా 6 సిక్సర్లు సాధించి అంతర్జాతీయ క్రికెట్లో ఆ ఘనత సాధించిన మొట్టమొదటి బ్యాట్స్‌మెన్ గా క్రికెట్ చరిత్రలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు.

టీమిండియా మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్‌కు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గ్లోబల్ టీ20 కెనడా లీగ్‌లో టొరంటో నేషనల్స్ జట్టుకు కెప్టెన్‌గా ఉన్న యువరాజ్ వాంకోవర్ నైట్స్‌తో జరిగిన ఆరంభ మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో నిరాశపరిచాడు. 27 బంతులు ఎదుర్కొని 14 పరుగులు మాత్రమే చేశాడు. అయితే, ఈ మ్యాచ్‌లో యువరాజ్ అవుట్ కాకున్నా మైదానాన్ని వీడాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన యువరాజ్.. చీమా వేసిన 17 ఓవర్‌లో భారీ షాట్‌కు యత్నించాడు. బంతి కీపర్ చేతికి తాకి వికెట్లపై పడింది. ఆ సమయంలో యువీ కాలు క్రీజులోనే ఉంది. అయినప్పటికీ ఔట్‌గా భావించిన యువరాజ్ అంపైర్ నిర్ణయం కోసం ఎదురుచూడకుండానే క్రీజు వదిలాడు. ఈ మ్యాచ్‌లో వాంకోవర్ జట్టు విజయం సాధించింది.

The post మళ్ళి బాట్ పట్టిన యువరాజ్, అవుట్ కాకున్నా క్రీజు వదిలివెళ్ళిన యువరాజ్, వీడియో. appeared first on DIVYAMEDIA.



from DIVYAMEDIA https://ift.tt/2YptbyC

No comments:

Post a Comment