etechlooks

Daily Latest news Channel

Breaking

Sunday, August 25, 2019

యాషెస్‌ సిరీస్‌ మూడో టెస్టులో అద్భుత క్యాచ్‌ పట్టిన వార్నర్‌,వీడియో

యాషెస్ సిరీస్.. క్రికెట్‌లోనే అతి పెద్ద సంగ్రామం. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య జరిగే ఈ సిరీస్‌ను కేవలం క్రికెట్‌గా మాత్రమే కాదు.. ఓ యుద్ధంలా చూస్తారు రెండు దేశాల అభిమానులు. రెండు జట్లు కూడా అంతే ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటాయి. అయితే హెడింగ్లే మైదానంలో జరుగుతున్న యాషెస్‌ సిరీస్‌ మూడో టెస్టులో ఇంగ్లాండ్‌ విజయం కోసం ఎదురీదుతోంది. 359 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆతిథ్య జట్టుకు నాలుగో రోజు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. అర్థసెంచరీతో ఫామ్‌లో ఉన్న కెప్టెన్‌ జో రూట్‌(77) నిన్నటి స్కోరుకు రెండు పరుగులు మాత్రమే జోడించి ఔటయ్యాడు. లియాన్‌ వేసిన బంతిని తప్పుగా అంచనా వేసిన రూట్‌ ముందుకొచ్చి ఆడబోయాడు. బంతి బ్యాట్‌ ఎడ్జ్‌ తీసుకొని, ప్యాడ్‌ను తాకి కీపర్‌ పైన్‌కు అందకుండా వెళ్లింది. ఫస్ట్‌ స్లిప్‌లో ఉన్న వార్నర్‌ అమాంతం గాల్లోకి ఎగిరి అద్భుత రీతిలో బంతిని ఒడిసి పట్టుకున్నాడు. అనంతరం ఆసీస్‌ ఆటగాళ్లు సెలెబ్రేషన్స్‌ చేసుకోగా, రూట్‌ మాత్రం నిరాశగా మైదానాన్ని వీడాడు. కాగా, ఇంగ్లాండ్‌ విజయం సాధించాలంటే 124 పరుగులు చేయాలి. ఆసీస్‌ విజయానికి 6 వికెట్ల దూరంలో ఉంది. మొదటి టెస్టు గెలిచి ఆసీస్‌ ముందంజలో ఉండగా, రెండో టెస్టు డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే.

The post యాషెస్‌ సిరీస్‌ మూడో టెస్టులో అద్భుత క్యాచ్‌ పట్టిన వార్నర్‌,వీడియో appeared first on DIVYAMEDIA.



from DIVYAMEDIA https://ift.tt/2ziDB95

No comments:

Post a Comment