పసుపు అల్లం జాతికి చెందిన దుంప. ఈ దుంప లోపలంతా పసుపు రంగులో ఉండటం వలన దీనికి పసుపు అని పేరు వచ్చిందని చెబుతారు. వంటలకు వాడే మసాలా దినుసుల్లో పసుపు చాలా ముఖ్యమైనది. భారతదేశంలో దాదాపు ఆరు వేల సంవత్సరాల నుంచి పసుపును ఔషధంగా, సౌందర్య సాధనంగా, వంటలో ముఖ్యమైన దినుసుగా, వస్త్రాలపై అద్దడానికి వాడుతున్నారు. బౌద్ధ శిష్యులు రెండు వేల సంవత్సరాల క్రితమే పసుపుతో అద్దకం వేసిన వస్త్రాలు ధరించారని తెలుస్తోంది. భారతదేశంలోని హిందువులు తమ నిత్యజీవితంలో ఏ శుభకార్యమైనా పసుపుతోనే ప్రారంభిస్తారు. మనదేశంలో పసుపు లేని, వాడని ఇల్లు ఉండదని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మహారాష్ట్రకు చెందిన సాంగ్లి పట్టణంలో ప్రపంచంలోనే అత్యధికంగా పసుపు వ్యాపారం జరుగుతుంది. పసుపును కనీసము 3000 సంవత్సరాలనుంది భారతీయులు వాడుతున్నారు . చిన్నచిన్న గాయాలనుండి క్యాన్సర్ వ్యాధులవరకు పసుపు విరుగుడుగా పనిచేస్తుంది . మనదేశములో ఆహారములో రంగు, వాసనలతో పాటు ఔషధగుణాల పేరున పసుపును వాడుతున్నారు .
పసుపు క్రిమిసంహారిని … క్రిములను నసింపజేస్తుంది . శరీరము పై ఏర్పడిన గాయాలకు, పుల్లకు పసుపు పూస్తే సూక్ష్మక్రిములు దరిచేరవు … సెప్టిక్ అవదు, త్వరగా మానుతుంది . ఇది ప్రకృతి పసాధించిన మహా దినుసు . దీనిలోని ” కర్కుమిన్ ” వాపులను తగ్గిస్తుంది యాంటిసెప్టిక్ గా పనిచేస్తుంది . దీని శాస్త్రీయ నామము ” Curcuma longa . పసుపు , అల్లం జాతికి చెందిన దుంప. ఈ దుంప లోపలంతా పసుపు రంగులో ఉండటం వలన దీనికి పసుపు అని పేరు వచ్చిందని చెబుతారు.
1. పాలు వేడిచేసి వాటిలో చిటికెడు పసుపు, మిరియాల పొడి కలిపి రాత్రి పడుకునే ముందు తాగితే దగ్గు తగ్గుతుంది.
2. సువాసన భరితమైన మరువాన్ని పసుపులో కలిపి నూరి రాస్తే చర్మవ్యాధులు తగ్గుతాయి.
3. పసుపు కొమ్ములను నూరి, నీళ్ళలో అరగదీసి గాని/ పసుపు పొడిని పేస్ట్‌లా నీళ్ళతో చాది గానీ కడితే సెగ్గడ్డలు – కరుపులు మెత్తబడతాయి. పుళ్లు మానుతాయి.
4. వేపాకు, పసుపు కలిపి నూరి ఆ పేస్ట్‌ను రాసుకుంటే మశూచి పొక్కులు, గజ్జి, తామర మొదలైన చర్మవ్యాధులలో దురద, మంట, పోటు తగ్గుతాయి.
5. పసుపు కలిపిన నీటిలో పరిశుభ్రమైన వస్త్రాన్ని ముంచి బాగా నాననిచ్చి, నీడన ఆరబెట్టి కాస్త తడి పొడిగా ఉంటుండగానే కళ్లు తుడుచుకుంటూ ఉంటే కంటి జబ్బులు తగ్గుతాయి.
6. వేప నూనెలో పసుపు కలిపి వేడిచేసి, కురుపులకు- గాయాలకు, గజ్జి, చిడుము లాంటి చర్మరోగాలకు పై పూతగా రాసుకుంటే గుణం కనిపిస్తుంది.
7. వేడి చేసిన నీటిలో తేయాకు, మినప పిండి, సెనగ పిండి, పసుపువేసి బాగా కలియతిప్పి, ఈ మిశ్రమాన్ని పొయ్యిమీద పెట్టి, రెండున్నర గ్లాసుల నీరు పోసి బాగా మరుగుతుండగా అట్టి ఆవిరిని పీలిస్తే ఉబ్బసం, ఇస్నోఫీలియా మటుమాయం అవుతుంది.
8. మెత్తటి పసుపు, ఉప్పు బాగా కలిపి, దానినే టూత్ పౌడర్‌గా వాడితే దంతాల నొప్పి, నోటి దుర్వాసన, పుప్పిపళ్లు నివారింపబడతాయి.
The post కొంచం పసుపుతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా ..? appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA https://ift.tt/2CPOH7k
No comments:
Post a Comment