మనం తినే ఆహారం మన సంస్కతిలో ఓ భాగం. కాలంతోపాటే ఆహార నియమాలు మారిపోతున్నాయి. అలా మారిపోవడం సహజం కూడా. అయితే ఈ మార్పు మన ఆరోగ్యానికి మేలు చేసేదయితే పర్వాలేదు. కానీ కీడు చేయడమే బాధాకరం. ఒకప్పుడు జొన్నలు, రాగులు, సజ్జలు, కొర్రలు, వరిగెలు, అరికెలు, ఊదలు, సామలు ఇలా .. ఇలా ఎన్నో ధాన్యాలను పండించుకునేవారు. వీటిలో కార్బోహైడ్రేట్స్ బియ్యంతో పోల్చుకుంటే తక్కువ. శరీరానికి కావలసిన పీచుపదార్థం, మాంసకత్తులు, ఖనిజలవణాలు, ఇనుము, సున్నం వంటివి అధికమొత్తంలో ఉంటాయి. అందువల్ల వాటిని తిన్నవారి ఆరోగ్యం బాగుండేది. కానీ ఇప్పుడా పంటలను ఎవరు పండిస్తున్నారు. పండించినా ఎవరు తింటున్నారు. అయితే రాగులు చాలా బలబద్దకమైన ఆహారం.తక్కువ కొవ్వు శాతాన్ని కలిగి,ఎక్కువ మొత్తంలో శరీరానికి శక్తిని అందిస్తుంది.రాగులలో కాల్షియం,ఐరన్,ఫైబర్ మరియు ప్రోటిన్స్,మినరల్స్ సంవృద్దిగా లబిస్తాయి.అంతేకాకుండా రాగులు తీసుకోవడం వల్ల అనేక అద్బుతమైన ప్రయోజనాలు ఉన్నాయి.అవేంటో ఇప్పుడు తెలుసుకుంధాం .
1. రాగుల్లో కాల్షియం అధికంగా ఉంటుంది.ఇది ఎముకలను బలోపేతం చేస్తుంది.రాగి ఎముకల పటుత్వానికి కావాల్సిన ధాతువుల నిర్మాణానికి దోహదపడుతుంది.
2. షుగర్ వ్యాధితో బాధపడేవారికి రాగితో చేసిన పానీయం చాలా మేలును చేస్తుంది.ఇది రక్తంలోని షుగర్ లెవల్స్ ను తగ్గిస్తుంది.
3. రాగిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి.ఇది వయస్సు పై బడటం వచ్చే లక్షనాలను తగ్గించి వయస్సు తక్కువగా కనపడేలా చేస్తుంది.
4. రక్తహినత సమస్యలతో బాధపడేవారికి రాగులు మంచి మేలును చేస్తాయి.రాగుల్లో ఐరన్ శాతం సంవృద్దిగా ఉంది.అందువల్ల రొజూ రాగి జవాను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
5. రాగిజావాను తీసుకోవడం ద్వారా కడుపు నిండినట్లు అనిపిస్తుంది.త్వరగా ఆకలి అనిపించదు.అందువల్ల బరువు తగ్గాలి అనుకునేవారికి రాగితో చేసిన ఆహారాన్ని తీసుకుంటే..మంచి ఫలితాన్ని పొందవచ్చు.
6. రాగిని తీసుకోవడం ద్వారా అధిక రక్తపోటు సమస్యను నివారిస్తుంది.రాగులను క్రమం తప్పకుండ తీసుకోవడం ద్వారా పోషకాహార లోపాన్ని తగ్గించుకోవచ్చు.
The post రాగిజావ నిత్యం తీసుకుంటే ఎన్ని లాభాలున్నాయో తెలుసా ..? appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA https://ift.tt/2OVzNCj
No comments:
Post a Comment