చెరకు ఒక గడ్డి జాతికి చెందిన తియ్యని కాండంగల మొక్క. చెరకు వెదురు గడలను పోలి ఉంటుంది. మధ్యమధ్య కణుపులు కలిగి ఉంటుంది. కణుపుల వద్ద ముక్కలుగా కత్తిరించి వాటిని నారుగా వాడుతారు. చెరకు రసం నుండి బెల్లం, పంచదార తయారుచేస్తారు. చెరకు పిప్పిని బాయిలర్లలో మండించి స్టీం తద్వారా కరంట్ ని ఉత్పత్తి చేస్తారు. చెరకు తయారీలో ఉపఉత్పత్తిగా మొలాసిస్ వస్తుంది. చెరకును మెడిసిన్ తయారీలో వాడతారు.
1. చెరుకు రసంలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఏర్పడే ఫ్రీ ర్యాడికల్స్ ప్రభావాన్ని తగ్గించడమే కాక, కణాలు నాశనం కాకుండా చూస్తాయి. దీంతోపాటు శరీర రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తాయి.
2. ఐరన్, మెగ్నిషియం, కాల్షియం, ఎలక్ట్రోలైట్స్ దీంట్లో అధికంగా ఉంటాయి. ఇవి డీహైడ్రేషన్ సమస్య నుంచిబయటపడేస్తాయి. ఎండలో తిరిగే వారు చెరుకు రసం తాగితే శరీరంలో ద్రవాలు సమతుల్యం అవుతాయి. దీంతో ఎండ దెబ్బ తాకకుండా ఉంటుంది. సాధారణ జలుబు, ఇతర ఇన్‌ఫెక్షన్లను తగ్గించడంలో చెరుకు రసం బాగా పనిచేస్తుంది.
3. చెరుకు రసం శరీరంలోని ప్రోటీన్ లెవల్స్‌ను పెంచుతుంది. మూత్రాశయ ఇన్‌ఫెక్షన్ల బారి నుంచి రక్షిస్తుంది. కిడ్నీల పనితనం మెరుగు పడుతుంది. లివర్‌ను పటిష్టం చేస్తుంది. పచ్చకామెర్ల వ్యాధి ఉన్న వారికి చెరుకు రసం మంచి ఔషధంగా పనిచేస్తుందని ఆయుర్వేదం చెబుతోంది.
4. అనారోగ్యాల బారి నుంచి త్వరగా కోలుకునేలా చేస్తుంది. తక్షణ శక్తినిచ్చే కార్బొహైడ్రేట్లు, ప్రోటీన్లు, ఐరన్, పొటాషియం వంటివి ఇందులో అధికంగా ఉన్నాయి. అలసట తొలగిపోతుంది.
5. చెరుకు రసాన్ని తరచూ తీసుకుంటే మలబద్దకం తొలగిపోతుంది. సహజసిద్ధమైన లాక్సేటివ్ గుణాలు దీంట్లో ఉన్నాయి. కడుపులో మంట, అసిడిటీ వంటి సమస్యలను తగ్గిస్తుంది.
6. మధుమేహం ఉన్నవారు కూడా నిరభ్యంతరంగా చెరుకు రసాన్ని తాగవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. ఇది రక్తంలోని చక్కెర స్థాయిలపై ప్రభావం చూపే అవకాశాలు తక్కువగా ఉంటాయని వారు చెబుతున్నారు.
7. నోటి దుర్వాసనను, దంత క్షయాన్ని తగ్గించే అనేక రకాల విటమిన్లు, మినరల్స్ చెరుకు రసంలో ఉన్నాయి.
The post చెరకు రసం తీసి ఇలా త్రాగితే ఎన్ని లాభాలున్నాయో తెలుసా ..? appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA https://ift.tt/35IwMfc
No comments:
Post a Comment