etechlooks

Daily Latest news Channel

Breaking

Friday, November 15, 2019

కరక్కాయ ఇలా చేసి తింటే అన్ని రోగాలు మటుమాయం.

కరక్కాయ శాస్త్రీయ నామం టెర్మినాలియా చెబుల్లా. చెబ్యులిక్ మైరోబాలన్, హరిటాకి, హారార్డ్ అనేవి ఇతర పేర్లు. ఇది 6-20 మీటర్ల ఎత్తువరకు పెరిగే వృక్షం. పత్రాలు కణుపు ఒకటి లేదా రెండు చొప్పున పొడవుగా, దాదాపు కోలగా ఉంటాయి. పుష్పాలు తెలుపు లేదా లేతాకుపచ్చ రంగులో సన్నని కంకులపై నక్షత్రాలవలె వస్తాయి. ఫలాలు కోలగా ఉండి, ఎండితే నిడుపాటి నొక్కులను కలిగి ఆగస్టు నుంచి అక్టోబరు వరకు లభిస్తాయి. ఇది విత్తనాల ద్వారా వ్యాప్తి చెందుతుంది. కరక్కాయ లేదా కరక ఔషధ జాతికి చెందిన మొక్క. కరక్కాయత్రిఫలాలలో ఒకటి. ఇది జీర్ణశక్తిని వృద్ధి చేస్తుంది. కరక్కాయలో చలువ చేసే గుణం ఉంది. పైత్యాన్ని హరిస్తుంది. దగ్గుతో బాధపడేవారు కరక్కాయ బుగ్గన ఉంచుకుంటే ఉపశమనం కలుగుతుంది. కరక్కాయ ముక్కలను నీళ్లలో నానపెట్టి, ఆ నీటిని తాగితే గుండెకు బలం చేకూరుతుంది. వాంతులవుతున్నప్పుడు కరక్కాయ పొడిని మంచినీళ్లలో తీసుకుంటే వాంతులు తగ్గుతాయి.

ఇది మలబద్దకాన్ని నివారిస్తుంది. వాతాన్ని వారిస్తుంది. కరక్కాయను అరగదీసి ఆ గంధాన్ని నుదుటన పట్టిస్తే తలనొప్పి కళ్లు మంటలు తగ్గుతాయి. కరక్కాయ పొడిలో మెత్తని ఉప్పు చేర్చి పండ్లు తోముకుంటే చిగుళ్లు గట్టిపడి పంటి వ్యాధులు రావు. పిప్పిపన్ను పోటు తగ్గుతుంది. కరక్కాయ పెచ్చులను పసుపు దుంపల రసంతో సహా లోహ ఖల్వంలో నూరి గోరుచుట్ట మీద తరచూ ప్రయోగిస్తూ ఉంటే గోరుచుట్ట పగిలి ఉపశమనం లభిస్తుంది. భోజనానికి అరగంట ముందు కరక్కాయ చూర్ణానికి కొంచెం బెల్లం కలిపి అరచెంచాడు మోతాదుగా రెండు పూటలా తీసుకుంటుంటే రక్తమొలలు తగ్గిపోతాయి.

The post కరక్కాయ ఇలా చేసి తింటే అన్ని రోగాలు మటుమాయం. appeared first on DIVYAMEDIA.



from DIVYAMEDIA https://ift.tt/2CKuyQe

No comments:

Post a Comment