etechlooks

Daily Latest news Channel

Breaking

Thursday, March 28, 2019

డెలివరీ అయిన 26 రోజులకే కవలలకు జన్మనిచ్చిన యువతి.. 30 ఏళ్ల తన సర్వీస్‌లో మొదటిసారి అంటున్న డాక్టర్

బంగ్లాదేశ్‌లో అరుదైన సంఘటన చోటుచేసుకుంది. అరిఫా సుల్తానా(20) అనే ఓ యువతి గత నెల ఓ మగబిడ్డకు నార్మల్ డెలివరీ ద్వారా జన్మనిచ్చింది. అయితే ఆ సమయంలో ఆమె గర్భాశయంలో మరో ఇద్దరు కవలలు ఉన్న విషయాన్ని డాక్టర్లు గమనించలేదు. దీంతో అరిఫా డెలివరీ అయిన 26 రోజులకు మళ్లీ డాక్టర్‌ను సంప్రదించింది. ఆమె గర్భాశయంలో కవలలను గుర్తించిన డాక్టర్లు గత శుక్రవారం సిజేరియన్ ద్వారా ఆపరేషన్ చేసి ఇద్దరు కవలల(ఒక అబ్బాయి, ఒక అమ్మాయి)కు జన్మనిచ్చారు. తన 30 ఏళ్ల సర్వీస్‌లో ఇలాంటి సంఘటన ఎప్పుడూ జరగలేదని జెస్సోర్ ప్రభుత్వ ఆసుపత్రి చీఫ్ డాక్టర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే అరిఫా పేద కుటుంబం నుంచి రావడంతో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చినప్పటికీ.. వారిని ఎలా పోషించాలోనని ఆవేదన వ్యక్తం చేసింది. తన భర్తకు నెలకు కేవలం 70 డాలర్లు(రూ. 4800) మాత్రమే జీతం వస్తున్నట్టు చెప్పింది. మరోపక్క ఆమె భర్త మాత్రం ఎలానైనా కష్టపడి తన పిల్లలను పెంచుకుంటానని స్పష్టం చేశాడు. కాగా, ఆమె గర్భాశయాన్ని ఎందుకు గమనించలేదని జెస్సోర్ ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లను చీఫ్ డాక్టర్ ప్రశ్నించారు.

The post డెలివరీ అయిన 26 రోజులకే కవలలకు జన్మనిచ్చిన యువతి.. 30 ఏళ్ల తన సర్వీస్‌లో మొదటిసారి అంటున్న డాక్టర్ appeared first on DIVYAMEDIA.



from DIVYAMEDIA https://ift.tt/2CESyok

No comments:

Post a Comment