వంకాయ వంటి కూరయు.. పంకజముఖి సీతవంటి భామామణియున్.. అనే పద్యం తెలుగు వారందరికీ తెలుసు. అంటే.. కూరల్లో వంకాయ వంటి కూర ఇంకొకటి ఉండదు.. దానికదే సాటి.. అని అర్థం వస్తుంది. అయితే కవులు చెప్పినట్లుగానే నిజంగా వంకాయ కూరను వండి తింటే చాలా అద్భుతంగా ఉంటుంది. భోజనప్రియులు ఎవరైనా సరే.. వంకాయ రుచికి ఫిదా అవ్వాల్సిందే. ఈ క్రమంలోనే మనం తినేందుకు మార్కెట్‌లో పలు రకాల వంకాయలు ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నాయి. అయితే వంకాయలు ఆకృతుల్లో భిన్నంగా ఉంటాయి కానీ కలర్లు మాత్రం రెండే. అవి గ్రీన్, వయొలెట్. మరి ఈ రెండు కలర్లలో ఏ రకం వంకాయలను తింటే మంచిదో తెలుసా..?
వంకాయల్లో గ్రీన్ కలర్ కాకుండా వయొలెట్ కలర్‌కు చెందిన వంకాయలను తినడం మంచిది. ఎందుకంటే.. సూర్యరశ్మిని బాగా గ్రహించి ఆ వంకాయలు పెరుగుతాయి. అందుకే అవి ఆ కలర్‌లో ఉంటాయి. కనుక వయొలెట్ కలర్‌లో ఉన్న వంకాయలను తినడమే ఉత్తమం. సూర్యరశ్మి గ్రహించబడిన వంకాయల్లో పోషకాలు బాగా ఉంటాయి. అందుకే వయొలెట్ కలర్ వంకాయలను తినాలి. ఇక వంకాయలను తినడం వల్ల క్యాన్సర్ రాకుండా చూసుకోవచ్చు. గుండె జబ్బులు, డయాబెటిస్ రాకుండా ఉంటాయి. దీంతోపాటు మన శరీరానికి కావల్సిన పలు ముఖ్యమైన పోషకాలు వంకాయల ద్వారా మనకు అందుతాయి.
The post గ్రీన్ లేదా వయొలెట్.. ఏ కలర్ వంకాయలు తింటే మంచిదో తెలుసా..? appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA https://ift.tt/2Yd533m
No comments:
Post a Comment