బాబోయ్.. బంగారం కంటే ఖరీదులా ఉంది. ఇంతకీ దేనికి వాడతారేంటి? అయినా తేలు కుడితే విషం ఎక్కి ఛస్తారంటారు కానీ ఇక్కడేంటి విషానికి ఇంత రేటు చెబుతున్నారు.. కొన్ని తేళ్లు కుడితే ఆ విషం మనిషి రక్తంలో చేరి క్షణాల్లో ప్రాణాలు పోతాయన్న మాట నిజమే. అయితే అలాగని అన్ని తేళ్లూ ప్రాణాలు తీయవు. కొన్ని కుడితే నొప్పిగా ఉంటుంది. డాక్టర్ దగ్గరకి వెళితే మందిస్తారు. ఒకటి రెండు రోజుల్లో తగ్గిపోతుంది. మరి అలాంటి విషపూరితమైన కొన్ని తేళ్ల విషాన్ని మనిషికి వచ్చే కొన్ని రకాల వ్యాధుల్ని తరిమికొట్టడానికి ఉపయోగిస్తే మంచిదని శాస్త్రజ్ఞులు కనిపెట్టారు. దాంతో తేలు విషానికి డిమాండ్ పెరిగింది.
గ్రాము విషం ధర రూ.7,30,000 ఉంటే లీటర్ విషం ధర రూ.73 కోట్ల రూపాయలు పలుకుతోంది. అందుకే ప్రపంచంలో అత్యంత ఖరీదైన విషంగా తేలు విషం గుర్తింపు పొందింది. తేలు విషంతో కీళ్లవాతాన్ని తగ్గించవచ్చని అమెరికాలోని బేలార్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ నిర్వహించిన పరిశోధనల్లో తేలింది. మొత్తం 13 లక్షల మందిపై ఈ మందుని ప్రయోగించారు. వారందరికీ కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభించింది. తేలు విషంలో ఉండే కాంపోనెంట్స్ వల్లనే ఇది సాధ్యమైందని వైద్యులు వివరించారు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నొప్పులను తగ్గించవచ్చని పరిశోధకులు తేల్చారు.
The post గ్రాము తేలు విషం రూ.7,30,000..!! ఎందుకు వాడతారో తెలిస్తే..షాక్ అవుతారు. appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA https://ift.tt/2JtknWp
No comments:
Post a Comment