చిన్న వయసులోనే పెళ్లయిన యువతులకు సంసార జీవితం సజావుగా సాగితే బాగానే ఉంటుంది. కానీ కుటుంబ సమస్యలు, సంసార బాధ్యతలు, పిల్లలు.. ఇలా అనేక ఇబ్బందులతో జుట్టు బాగా రాలిపోయి పలుచగా అవుతోందా? మగవాళ్లకు ఆఫీసు ఒత్తిళ్లతో, ఆర్థిక ఇబ్బందులతో హెడ్ మొత్తం బోల్డ్గ్ గా అవుతోందా? అయితే అక్కడ ఈ రసం రాస్తే జుట్టు మళ్ళీ పెరిగి ఒత్తుగా అవుతుంది. ఎవరికైనా చక్కని తలకట్టుతో ముఖం వైపు జుట్టు ఒత్తుగా ఉంటే ఆ అందమే వేరు. ఇప్పుడు కాలుష్యం, హార్మోన్ల తేడా వల్ల ముందు వైపు తల కట్టు అంటే హెయిర్ లైన్ వెనక్కి వెళ్తోంది. పెద్ద నుదురు వల్ల పెద్ద వయసు వారిలాగా కనిపిస్తారు. అందుకే ఈ సమస్య పరిష్కారం కావాలంటే ఈ కింది విధంగా చేయాలి.
ఏం చేయాలంటే:
* ముందుగా బంగాళదుంప ముక్కలుగా కోసి మిక్సీలో వేసి దాని రసం తీయాలి.
* తర్వాత ఆ రాసాన్నిజుట్టు పలుచగా ఉన్నచోట రాయాలి. ముందువైపు పక్కలు లేదా మొత్తం తల కుదుళ్లకు రాస్తే మంచిది.
* ఇలా రాయడం వల్ల కుదుళ్లు బలం పెరిగి జుట్టు బాగా పెరుగుతుంది.
* ఇకపోతే కొబ్బరినూనెలో బంగాళా దుంప రసం వేసి జుట్టుకి మర్దన చేసి కూడా మంచి ఫలితాలు వస్తాయి.
* ఇది రాసిన ఒక గంట తరువాత తలస్నానం చెయ్యొచ్చు.
* బంగాళదుంప లో విపరీతమైన పొటాషియం ఉంటుంది.
* ఇది జుట్టు ఎదుగుదలకు చాలా అవసరం అందుకే ఇది జుట్టుకి రాస్తే చాలా బాగుంటుంది.
The post జుట్టు బాగా రాలిపోయి పల్చగా అవుతోందా? అయితే అక్కడ ఈ రసం రాస్తే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA https://ift.tt/2UQsbm7
No comments:
Post a Comment