etechlooks

Daily Latest news Channel

Breaking

Thursday, March 21, 2019

నడుము నొప్పి వెంటనే తగ్గించే చిట్కా మీ కోసం..తెలుసుకోండి.

ఈరోజుల్లో నడుమునొప్పి, వెన్నునొప్పి తో అనేకమంది బాధపడుతున్నారు. దీనికి కారణం వారు తీసుకునే ఆహారంలో పొషక విలువలు సరిగా లేకపోవడమే. ఒకప్పుడు వయసు పెరిగినవారికే ఈ నొప్పులు వచ్చేవి. కాని ఇప్పటి మారిన ఆధునిక జీవనవిధానం వల్ల వయసుతో పనిలేకుండా అందరిలో ఈ నొప్పులు వస్తున్నాయి. దీనికి ముఖ్యకారణం ఎక్కువసేపు కుర్చీలలో కూర్చోవడం, ఆ కుర్చీలు సౌకర్యవంతమైనవి కాకపోవడం, సరైన భంగిమలలో కూర్చోకపోవడం.. తదితర కారణాలెన్నో.. అయితే ఎలాంటి నడుమునొప్పి, వెన్నునొప్పినైనా సహజపద్దతిలో తగ్గించుకునే కొన్ని చిట్కాలను ఇప్పుడు తెలుసుకుందాం .

కొంచెం నువ్వుల నూనె ఒక గిన్నెలో తీసుకుని స్టవ్ ఫై పెట్టి వేడిచేస్తూ అందులో ఒక పది వెల్లులి రెబ్బలను వేయాలి. భాగా మరిగించి చల్లారిన తరువాత ఒక సీసాలోకి తీసుకొవాలి. ఈ నూనెని నడుము, వెన్నునొప్పి ఉన్నచోట స్నానానికి ఒక గంట ముందుగానీ, పడుకునేముందు గానీ భాగా మర్దన చేసుకోవాలి. వెల్లుల్లిలోని యాంటి ఆక్సిడెంట్లు, పోషకాలూ నొప్పి తగ్గడానికి గొప్పగా సహకరిస్తాయి. అంతేకాకుండా..

ఒక గ్లాసు పాలలో ఒక టి స్పూన్ నువ్వులపొడి, కొంచెం బెల్లం కలుపుకుని ప్రతిరోజూ కొన్ని వారాలపాటు తాగడం వలన నడుమునొప్పి, వెన్నునొప్పి, మోకాళ్ల నొప్పులు, కీళ్లనొప్పులు తగ్గ్గిపోతాయి. అలాగే గుడ్డులోని తెల్లసొనలో కొంచెం కలబంద గుజ్జుని కలిపి నొప్పులు ఉన్నచోట రాసి బాగా మర్దన చెయ్యడం వలన నొప్పులనుండి ఉపశమనం కలుగుతుంది. శరీరంలో కాల్షియమ్ పెరగాలంటే.. కాల్షియమ్ లభించే పదార్థాలతోపాటు సి విటమిన్ లభించే టమాటా, నిమ్మరసం లాంటివి తీసుకొవాలి. అప్పుడే కాల్షియమ్ వృద్ధి జరుగుతుంది. ఇది కీళ్ల వ్యాధుల నివారణకు తోడ్పడుతుంది.

The post నడుము నొప్పి వెంటనే తగ్గించే చిట్కా మీ కోసం..తెలుసుకోండి. appeared first on DIVYAMEDIA.



from DIVYAMEDIA https://ift.tt/2HMSczk

No comments:

Post a Comment