వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైసీపీ అనుసరించిన తీరు ఆ పార్టీ ఇమేజ్ ను డ్యామేజ్ చేసిందా? టీడీపీని ఇరుకున పెట్టబోయి YCP అధినేత జగన్ సెల్ఫ్ గోల్ చేసుకున్నారా? తాను అల్లబోయిన ప్రచార వ్యూహం చివరికి తన మెడకే చుట్టుకుందా? తాజా పరిణామాలు చూస్తుంటే ఈ ప్రశ్నలన్నింటికి ఔననే సమాధానమే వినిపిస్తున్నాయి. వివేకా హత్య కేసులో వైసీపీ అమలు చేసిన రాజకీయ వ్యూహం అంచనాలు తప్పింది. వివేకా మృతి గుండెపోటు కారణం కాదు ఎవరో హత్య చేశారనే సంచలన విషయం బయటికి పొక్కింది. వెంటనే ఏపీ రాజకీయం వేడెక్కిపోయింది.
జరిగింది హత్య. తలపై గాట్లు, చెయ్యి, కాలుపై వేటు పడినట్లు స్పష్టంగా తెలుస్తున్నా..బాహ్య ప్రపంచానికి మాత్రం గుండెపోటుగా ప్రచారం జరిగింది. 6 గంటల 40 నిమిషాల సమయంలో పోలీసులకు సమాచారం అందించారు. కానీ, పోలీసులు రాకముందే రక్తం మరకల్ని కడిగివేశారు. బాత్ రూం నుంచి మృతదేహాన్ని బెడ్రూంలోకి తీసుకొచ్చారు. కేసు అవసరం లేదని కూడా పోలీసులతో చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో హత్యపై అనేక అనుమానాలు అలుముకున్నాయి. అసలే ఏపీ ఎన్నికలు యుద్ధక్షేత్రాన్ని తలపిస్తున్న వేళ వివేకా హత్యకు గురవటం రాజకీయాల్లో పెను ప్రకంపనలకే కారణం అయ్యింది. హత్య ఎవరు చేశారు? ఎందుకు చేశారు? ఇలాంటి ప్రాథమిక అంశాలపై ఓ అంచనాకు కూడా రాక ముందే హత్య చేయించింది ముఖ్యమంత్రి చంద్రబాబే అని ఆరోపించింది వైసీపీ.
ప్రభుత్వం హత్యా రాజకీయాలకు తెగబడుతుందంటూ ఆరోపించిన జగన్..వైఎస్ కుటుంబాన్ని అంతం చేయాలని చూస్తున్నారంటూ ఆరోపణల్లో డోస్ కూడా పెంచారు. అయితే.. కేసులో ఏ మాత్రం ఆధారాలు బయటికి రాకముందే వైసీపీ తీసుకున్న పొలిటికల్ స్టాండ్…ఆ పార్టీని అబాసుపాలు చేసేలా మార్చింది. విచారణ ముమ్మరం అవుతున్న కొద్ది వివేకా హత్యతో టీడీపీకి ఎలాంటి ప్రమేయం లేదనే దిశగా ఆధారాలు వెలుగులోకి వస్తున్నాయి. దీంతో తన అడ్డగోలు ఆరోపణలతో వైసీపీ జనంలో పలుచనైపోతోందన్న విమర్శలు విన్పిస్తున్నాయి.
ఎన్నికల వేళ రాజుకున్న ఈ వికృత రాజకీయంపై తొలి నుంచి భిన్నమైన వాదనలు వినిపిస్తూనే ఉన్నాయి. జనంలో విభన్న చర్చలు జరుగుతూనే ఉన్నాయి. అయితే..జగన్ ఆరోపణలతో అలర్ట్ అయిన చంద్రబాబు హత్యా రాజకీయాల దుష్ఫ్రభావాన్ని ప్రతీ సభలోనూ జనాలకు వివరిస్తున్నారు. హత్యతో తమకేమీ సంబంధం లేదని చెబుతూనే… వైసీపీ ఆరోపణల వెనక దాగున్న రాజకీయ ప్రయోజనాలపై కూడా అవగాహన కల్పించేందుకు ప్రాధాన్యం ఇచ్చారు. సీబీఐ విచారణ కోరటంలో మర్మాన్ని బోధపడేలా ప్రసంగాలతో వైసీపీని వ్యూహాత్మకంగా ఇరుకున పెడుతున్నారు చంద్రబాబు.
వైఎస్ వివేకా హత్యకు ముందు జగన్ బెదిరింపు ధోరణి, అవినీతి రాజకీయాలను, అనుభవ రాహిత్యాన్ని హైలెట్ చేస్తూ వస్తున్నారు చంద్రబాబు. కొత్త రాష్ట్రంలో రాజధాని నిర్మాణంతో పాటు రాష్ట్ర దశ దిశను మార్చబోయే కీలకమైన పరిస్థితుల్లో తన క్రెడిబిలిటిని మైలేజ్ గా మలుచుకుంటున్నారు. అదే సమయంలో జగన్ అవినీతి కేసులను ప్రజలకు వివరిస్తూ..అధికారంలోకి వస్తే రాజధాని నిర్మాణం అంతా అవినీతిమయంగా మారుతుందని..ఇప్పటి వరకు చేసిన కష్టం వృద్ధా అవుతుందనే ఆవేదనను జనంలోకి తీసుకెళ్లేలా ప్రసంగించేవారు. అయితే..వివేకా హత్య తర్వాత వైసీపీ ఆరోపణలను తిప్పికొట్టడంలో భాగంగా జగన్ హత్యరాజకీయాల తీరును ప్రజలకు వివరిస్తున్నారు. అందరికీ ఆదర్శంగా ఉండే సంస్కృతి, సాంప్రదాయాలున్న ఆంధ్రాలో అసలు ఈ హత్యా రాజకీయాలు మనకు అవసరమా అనే అభిప్రాయం జనంలో బిల్డప్ అవుతోంది.
వివేకా హత్యతో రాజకీయ ప్రయోజనం పొందాలని అనుకున్న వైసీపీని… చంద్రబాబు ఎదురుదాడి డిఫెన్స్ లో పడేసింది. జగన్ వస్తే రాష్ట్రం పులివెందులలా మారుతుందని హత్యా రాజకీయాల కల్చర్ వస్తుందని చంద్రబాబు కడిగిపారేస్తున్నారు. చంద్రబాబు ప్రసంగాలు యువత, విద్యావంతులను ఆలోచింపజేసేలా ప్రభావం చూపిస్తున్నాయి. ముఖ్యంగా అర్భన్ ఓటర్లలో ఎక్కువ ప్రభావం కనిపిస్తోంది. న్యూట్రల్ ఓటర్లతో పాటు అర్భన్ ఓటర్లలో వైసీపీపై ప్రతికూలతను పెంచుతోందని అంటున్నారు విశ్లేషకులు.
2014 ఎన్నికల్లో కూడా తొలుత టీడీపీకి ప్రతికూల పరిస్థితులే కనిపించాయి. సర్వేలన్ని వైసీపీ పక్షం నిలిచాయి. కానీ, చంద్రబాబు తన అనుభవం..కొత్త రాష్ట్రానికి తన అవసరాన్ని ప్రజలకు వివరించటంలో విజయం సాధించారు. దీంతో నెల్లూరు, ప్రకాశం, సీమ జిల్లాల్లో మినహా టీడీపీ ఎడ్జ్ సాధించింది. ఇక ఇప్పుడు ప్రశాంతతను కోరుకున్న ఆంధ్రాకు హత్యా రాజకీయాలకు పాల్పడే పార్టీలు అవసరమా అంటూ చంద్రబాబు చేస్తున్న ప్రసంగాలు జనంలోకి వెళ్తున్నాయి. కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాలో ఓటర్లను ఆలోచింపచేస్తోంది. అవినీతి రాజకీయాలు, స్వార్ధ రాజకీయాలు, రాజధాని నిర్మాణంలో సృష్టించిన అడ్డంకులు, మోడీ-కేసీఆర్ తో దోస్తీ, హత్యా రాజకీయాలు ఇలా వరుసగా వైసీపీ అవలక్షణాలను ప్రజలకు వివరిస్తున్నారు చంద్రబాబు.
ఎన్నికల సమయంలో రాయలసీమ కేంద్రంగా ఏపీలో మంటలు రాజేసిన వివేకా హత్యతో లాభం ఎవరికి? ఏపీలో ఇప్పటివరకు జరిగిన విస్తృత చర్చ ఇది. మీరే కారణమంటూ టీడీపీపై జగన్ ఆరోపణలు. సీబీఐ ఎంక్వైరీకి డిమాండ్. గవర్నర్ కు ఫిర్యాదు…ఇలా టీడీపీని డిఫెన్స్ లోకి నెట్టేసే ప్రయత్నం చేశారు జగన్. కానీ, సిట్ విచారణలో అసలు కారణాలు బయటికొస్తున్నాయి. హత్య వెనక వ్యక్తిగత, ఆర్ధికపరమైన అంశాలు దాగున్నాయనే దిశగా ఆధారాలు ఒక్కోటిగా తెలుస్తున్నాయి. దీంతో హత్య కేసులో జనం అనుమానపు చూపులు టీడీపీ వైపు నుంచి వైపీసీ వైపు టర్న్ తీసుకుంటున్నాయి. హత్య కేసులో ప్రభుత్వం వేగంగా స్పందించి విచారణకు సిట్ ఏర్పాటు చేయటం..జగన్ ఆరోపణల ఆంతర్యాన్ని ప్రజలకు వివరించటంలో సక్సెస్ అయ్యారు. అటు విచారణలోనూ అసలు విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దీంతో జగన్ తాను తవ్వుకున్న గోతిలో తానే పడిపోతునట్లైంది. టీడీపీ మెడకు బిగుస్తుందని పన్నిన ఉచ్చు ycp మెడకే బిగుసుకుంటోందన్న వాదనలు బలపడుతున్నాయి.
The post వైసీపీ మెడకే ఉచ్చు బిగుసుకుంటోందా? appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA https://ift.tt/2Y5nerL
No comments:
Post a Comment