బాలీవుడ్ బ్యూటీస్ కంగనా రనౌత్, ఆలియా భట్ ఒకరిపై ఒకరు కౌంటర్లు వేసుకోవడం సినీ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. గతంలో చాలాసార్లు ఈ ఇద్దరి సంభాషణలు హాట్ టాపిక్ కాగా.. తాజాగా మరోసారి ఈ భామల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ముందుగా ఆలియాపై కంగనా కామెంట్ చేయడంతో దానిపై రిటర్న్ కౌంటర్ వేస్తూ ఆలియా స్పందించింది.
ఇటీవల ఓ మీడియా సంస్థ నిర్వహించిన పోల్‌లో ఉత్తమ నటిగా కంగనా, ఆలియాలు పోటీపడ్డారు. అయితే ఆ సమయంలో ఆలీయాను తక్కువ చేయడమే గాక, మీడియాను కూడా తప్పుబడుతూ ఊహించని రీతిలో కామెంట్ చేసింది కంగనా. స్టార్ కిడ్స్‌ని మీడియా బాగా హైలైట్ చేస్తోందని పేర్కొంటూ ఆలియాతో తనకు పోలికేంటని ప్రశ్నించింది. ఆమెది సాదాసీదా నటన అని, అలాంటి వారిని మీడియా ప్రోత్సహించడం ఆపాలని కంగనా పేర్కొనడంతో అంతా షాక్ అయ్యారు. సోషల్ మీడియాలో కంగనా చేసిన ఈ వ్యాఖ్యలపై ఆలియా, కంగనా ఫాన్స్ మధ్య పెద్ద వార్ నడుస్తోంది.
ఈ నేపథ్యంలో తాజాగా ఈ ఉదంతంపై స్పందించిన ఆలియా.. కంగనాపై కౌంటర్ వేయడం విశేషం. ఓ మీడియాతో మాట్లాడిన ఆలియా.. ‘‘కంగనా చేసే పనులంటే నాకెంతో గౌరవం. ఆమె అభిప్రాయాల మీద కూడా నాకెంతో నమ్మకం ఉంది. ‘రాజీ’ సినిమా చూసిన తర్వాత నా నటన గురించి ఆమె ఏం మాట్లాడిందో నాకు గుర్తుంది. నేను నా పని మీదనే దృష్టి పెడతాను తప్ప ఒకరి ప్రశంసల కోసం పని చేయను. కానీ ఈ నియమాన్ని కంగన విషయంలో కొద్దిరోజులు పక్కన పెడతాను. ఆమె ప్రశంసలు అందుకునే స్థాయిలో నేను కష్టపడలేదేమో. ఈసారి మరింత శ్రమించి ఆమె దగ్గర అభినందనలు పొందుతాను’’ అని పేర్కొంటూ ఊహించని రీతిలో కంగనాకు కౌంటర్ వేసింది ఆలియా భట్. చూడాలి మరి వీరిద్దరి మాటల యుద్ధం ఇంకెంత దూరం వెళుతుందో!
The post ఒకరిపై ఒకరు కౌంటర్స్ వేసుకుంటున్న స్టార్ హీరోయిన్లు.. ఇప్పుడిదే హాట్ టాపిక్ appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA http://bit.ly/2KzX5i1


No comments:
Post a Comment