నిజంగా మూడు గంటల సినిమా జీవితాలను మారుస్తుందా.. అలా అంటే ఇప్పటికి చాలా మంది మారిపోయి ఉండాలే. నిజానికి మారాలంటే ఓ నిమిషం పట్టదు. ఓ మంచి మాటకూడా మనిషిని మార్చేస్తుంది. అలాగే తన జీవితాన్ని ఓ సినిమా మార్చేసిందని 25 ఏళ్ల నిధి యాదవ్ ఆనందంగా చెబుతోంది. అందుకే అందరిలో ఒకరిగా మిగిలిపోకుండా.. నలుగురికీ ఆదర్శంగా నిలుస్తోంది. ఇండోర్‌లో పుట్టిన నిధి యాదవ్ కంప్యూటర్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. డెలాయిట్ కంపెనీలో ఏడాదికి పైగా ఉద్యోగం చేసింది. ఓ రోజు స్నేహితులతో కలిసి ద డెవిల్ వియర్స్ ప్రాడా అనే సినిమా చూసింది. అందరిలా ఆమె సినిమాని చూడలేదు. తనలో స్ఫూర్తిని నింపేదిగా అనిపించింది ఆ చిత్రం. ఆమె ఆలోచనలను మార్చేసింది.
చేస్తున్న ఉద్యోగానికి రిజైన్ చేసి ఫ్యాషన్ రంగంలోకి ప్రవేశించి తనేంటో నిరూపించుకోవాలనుకుంది. ఇటలీలోని ప్లోరెన్స్‌లో ఉన్న పోలిమోడా ఫ్యాషన్ స్కూల్లో చేరింది. కోర్సు పూర్తయిన తరువాత ఉద్యోగం వచ్చింది. కానీ సంతృప్తి లేదు. అక్కడి నుంచి భారత్‌కు తిరిగి వచ్చి గురుగ్రామ్‌లోని ఓ ఫ్యాషన్ బ్రాండ్‌లో పని చేసింది. తరువాత పెళ్లి చేసుకుంది. ఖాళీగా ఉండకుండా ఏదో ఒకటి చేయాలి అని అనుకుంది. అప్పుడే స్టార్టప్ ఆలోచన వచ్చింది. కానీ కుటుంబ సభ్యుల నుంచి కొంత వ్యతిరేకత వచ్చింది. అది నీవల్ల సాధ్యం కాదని నిరుత్సాహపరిచారు. తనేంటో తనకు తెలుసు. అందుకే వెనుకడుగు వేయదలుచుకోలేదు నిధి. ముందుగా దానికోసం చాలా వర్కవుటే చేసింది. వివిధ ఇంటర్నేషనల్ ఫ్యాషన్ బ్రాండ్స్‌పై రీసెర్చ్ చేసింది. తనమీద తనకు పూర్తి నమ్మకం కలిగాక మే 2014లో నిధి ఏకేఎస్ క్లాతింగ్స్ సంస్థను ఏర్పాటు చేసింది. కేవలం 3.5 లక్షల పెట్టుబడితో వ్యాపారాన్ని ప్రారంభించింది.
మార్కెట్‌ని అనుసరించి కొత్త ట్రెండ్స్ ఫాలో అవుతూ ప్రతి వారం 15 నుంచి 20 కొత్త స్టైల్స్‌ని తీసుకువచ్చేది. అలా మొదలు పెట్టి ఇప్పుడు నెలకు 150 స్టైల్స్‌ని తీసుకు వస్తుంది. వ్యాపారంతో పాటు ఆదాయమూ పెరిగింది. వార్షిక ఆదాయం రూ.100 కోట్లకు చేరుకుంది. ఏకేఎస్ పేరుతో ఉన్న ఈ బ్రాండ్ దుస్తులు ప్లిప్ కార్ట్, జబాంగ్, మింత్ర వంటి ప్లాట్‌ఫామ్‌లపై అందుబాటులో ఉన్నాయి. వ్యాపార రంగంలో దూసుకుపోతూ నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తుంది నిధి యాదవ్.
The post ఓ సినిమా ఆమె జీవితాన్ని మార్చేసింది.. 3.5 లక్షల పెట్టుబడితో 100 కోట్లు. appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA http://bit.ly/2Zx5rua


No comments:
Post a Comment