తనమీద ప్రతిరోజూ నోరు పారేసుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబును “అధికారాలు లేని ముఖ్యమంత్రి మాత్రమే” అని చెప్పడం ద్వారా చంద్రబాబు స్థానం ఏమిటో ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రెటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం తెలియజెప్పారు. అంతేకాదు..జూన్ ఎనిమిది వరకు కుర్చీ నాదే అని పరమ తెలివితక్కువ ప్రకటన చేసిన చంద్రబాబుకు “నీ రోజు మే ఇరవై మూడుతో ముగుస్తుంది” అని ఘాటుగా దిమ్మతిరిగిపోయే కౌంటర్ ఇచ్చారు. అధికారులకు నేనే బాస్ అని, ప్రతిఒక్క అధికారి తన ఆదేశాలను పాటించాల్సిందే అని సుబ్రహ్మణ్యం కుండబద్దలు కొట్టి చంద్రబాబు బానిసలకు వార్నింగ్ ఇచ్చారు. యనమలకు కూడా ఇదే తరహా హెచ్చరికను జారీ చేసారు సుబ్రహ్మణ్యం.
ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుక్షణమే కొత్త ముఖ్యమంత్రి వస్తాడని చెప్పడం ద్వారా తెలుగుదేశం నాయకుల అత్యుత్సాహాన్ని అణచి వేశారు. సమర్థులైన అధికారులు సమయం వస్తే తమ తడాఖా చూపిస్తారని ఎల్వీ సుబ్రహ్మణ్యం రుజువు చేశారు.
The post ఎల్వీ సుబ్రహ్మణ్యం విశ్వరూపం appeared first on Tollywood Superstar.
from Tollywood Superstar http://bit.ly/2ZE1Kmq
via IFTTT
No comments:
Post a Comment