తోబుట్టువుల మధ్య పోట్లాట అనేది సహజం. ప్రతీ విషయానికి గొడవపడటం.. కొట్టుకోవటం కూడా కామనే. ఇదంతా బయట అంటే వారు పుట్టాక జరుగుతుంది. కానీ ఈ వీడియో చూస్తే.. తల్లి గర్భంలోనే ఈ తగదా ప్రారంభమవుతుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఇంకా పూర్తిగా నెలలు కూడా నిండని ఇద్దరు కవలలు అమ్మ పొట్టలోనే కిక్‌బాక్సింగ్ మొదలు పెట్టారు. ప్రస్తుతం ఈ కవల పిండాల దెబ్బలాటకు సంబంధించిన వీడియో తెగ వైరలవుతోంది. వివరాలు.. చైనాకు చెందిన ఓ మహిళ నాలుగో నెలల గర్భంతో ఉండగా వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి వెళ్లింది. అక్కడ వైద్యులు ఆమెకు అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేశారు.
ఈ సమయంలో ఆమె గర్భంలో ఉన్న ఇద్దరు కవలలు ఒకరితో ఒకరు ఫైటింగ్ చేస్తూ కనబడ్డారు. అక్కడే ఉన్న ఆమె భర్త దీన్నంతా వీడియో తీశాడు. అనంతరం దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరలవ్వడమే కాక అనేక ప్రశంసలు అందుకుంటుంది. ‘తల్లి గర్భంలోనే ఇలా పోట్లాడుకుంటున్నారు.. ఇక బయటకు వచ్చాక ఇంకెంత తన్నుకుంటారో’.. ‘ఖచ్చితంగా బాక్సర్లే అవుతారు’ అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
The post వైరలవుతోన్న కవల పిండాల క్యూట్ ఫైట్, కావాలంటే మీరు చుడండి. appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA http://bit.ly/2GhUzrw
No comments:
Post a Comment