etechlooks

Daily Latest news Channel

Breaking

Friday, April 26, 2019

హైదరాబాదు లో పోయిన RTC బస్సు దొరికింది, అది ఎలా ఉందొ తెలుసా …!

సీబీఎస్‌లో చోరీకి గురైన తెలంగాణ ఆర్టీసీ బస్సు ఆచూకీ లభించింది. మంగళవారం రాత్రి చోరీకి గురయిన బస్సును నాందేడ్‌లోని ఓ షెడ్‌లో పోలీసులు గుర్తించారు. కానీ బస్సును ముక్కలు ముక్కలు చేసిన దుండగులు.. దాని గుర్తుపట్టలేని విధంగా మార్చేశారు. వివరాల్లోకి వెళ్తే.. కుషాయిగూడ డిపో ఏపీ 11 జెడ్‌ 6254 నెంబర్‌ గల ఆర్టీసీ బస్సు అంబేడ్కర్‌ నగర్‌, అఫ్జల్‌గంజ్‌ల మధ్య రాకపోకలు సాగిస్తుంది. మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో నైట్‌హాల్ట్‌ కోసం డ్రైవర్‌ ఆ బస్సును సీబీఎస్‌లో నిలిపాడు. అయితే ఆ బస్సు కనిపించకుండా పోయింది. దీంతో పోలీసులు, ఆర్టీసీ అధికారులు బస్సు కోసం గాలింపు చేపట్టారు. పలుచోట్ల సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించిన పోలీసులు.. మంగళవారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో తూప్రాన్‌ ప్రాంతంలో తిరిగినట్టు ఆధారాలు సేకరించారు. ఆ దిశగా విచారణ చేపట్టిన పోలీసులు గురువారం నాందేడ్‌లో బస్సును గుర్తించారు.

బస్సును అపహరించిన వ్యక్తులు దాని రూపురేఖలు మార్చేందుకు ఆ బస్సును క్రాష్‌ చేస్తున్న సమయంలో అఫ్జల్‌ గంజ్‌ పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు రావడం గమనించిన నిందితులు అక్కడి నుంచి పరారు అయ్యారు. దీంతో బస్సు క్రాష్‌ చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

The post హైదరాబాదు లో పోయిన RTC బస్సు దొరికింది, అది ఎలా ఉందొ తెలుసా …! appeared first on DIVYAMEDIA.



from DIVYAMEDIA http://bit.ly/2IKkhZk

No comments:

Post a Comment