టీం ఇండియా మాజీ మెంటల్ కండిషన్ కోచ్ ప్యాడీ అప్‌టన్ తాజాగా ఓ వివాదానికి తెరలేపిన విషయం తెలిసిందే. ఇటీవల ఓ పుస్తకాన్ని విడుదల చేసిన ఆయన అందులో మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. గంభీర్ నిరాశవాది.. సెంచరీ సాధించినా కూడా అతనికి ఆనందం ఉండదు అంటూ ఆయన పేర్కొన్నారు. ఇది వివాదాస్పదమైంది. తాజాగా టీం ఇండియాకు సంబంధించి మరో ఆసక్తికర విషయాన్ని ఆయన బయటపెట్టారు. ఆటగాళ్లు ప్రాక్టీస్‌కి లేటుగా వస్తే.. మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ, మాజీ కోచ్ అనిల్ కుంబ్లే ఎటువంటి శిక్ష విధించేవారో ఆయన తెలిపారు.
‘‘పరిస్థితి ఎలా ఉన్నా.. ధోనీ చాలా ప్రశాంతంగా ఉంటాడు. ఎంతో క్లిష్ట పరిస్థితో కూడా ధోనీ జట్టును ముందుకు నడిపించాడు. ఇతర ప్లేయర్లను కూడా తనలా ప్రశాంతంగా ఉండాలి అని సూచిస్తాడు. నేను జట్టులో చేరినప్పుడు అనిల్ కుంబ్లే టెస్ట్‌లకు, ధోనీ వన్డేలకు కెప్టెన్లుగా ఉన్నారు. సొంత నిర్ణయాలు తీసుకొనేందుకు మాకు అవకాశం ఉండేది. అందరూ కచ్చితంగా టైంకి ప్రాక్టీస్‌కి రావాలని నిర్ణయం తీసుకున్నాం. అందుకు అందరూ అంగీకరించారు. ఒకవేళ లేటుగా వస్తే.. వాళ్లకి ఏం శిక్ష వేయాలనే నిర్ణయాన్ని కెప్టెన్‌లకు వదిలేశాం. అయితే లేటుగా ప్రాక్టీస్‌కి వస్తే.. అనిల్ కుంబ్లే.. రూ.10వేలు జరిమానా విధించేవారు. అదే పద్ధతిని ధోనీ కూడా కొనసాగించాడు’’ అని ఆయన తెలిపారు.
The post ఆటగాళ్ళు ప్రాక్టీస్‌కి లేటుగా వస్తే ధోని ఏం చేసేవాడో తెలుసా …! appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA http://bit.ly/2HlGyup
No comments:
Post a Comment