సింధు అనే క్రీడాకారిణి ఇండోనేషియా లో ఫైనల్లో ఓడిందట. మరో పది సార్లు ఓడినా, దేశ ప్రతిష్టను మంట కలిపినా, ఆమెకు లభించే రాచమర్యాదలు, గౌరవాలు, స్వాగతాలు ఏమాత్రం తగ్గవు. ఆమెకున్న డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం ఊడదు. పేజీలకు పేజీల వ్యాసాలు, ఇంటర్వ్యూలు, సన్మానాలు, సత్కారాలు.. ఎలాంటి లోటు ఉండదు. హిమదాస్ అనే క్రీడాకారిణి 18 రోజుల వ్యవధిలో 5 స్వర్ణాలు సాధించిందట. మరో యాభై స్వర్ణాలు సాధించినా, ఆమె ఇండియా తిరిగొచ్చి విమానం దిగాక ఆటో ఎక్కి ఇంటికి వెళ్లాల్సిందే. ఆమెను ఎవరూ పట్టించుకోరు. వాళ్ళ వర్ణాల్లో ఏదో తేడా ఉందట, డెబ్భై ఏళ్ల స్వాతంత్రం మరి.
నాకు కవిత్వం రాదు లేకపోతె నీ మీద ఒక కావ్యమే రాసేవాడిని.నాకు క్రీడల పట్ల ఆసక్తి లేదు క్రీడాకారుల గూర్చి ఎప్పుడూ పోస్టులు పెట్టలేదు కానీ, నీవు సాధించిన విజయాలను గూర్చి వింటుంటే నా రొమ్ము ఉప్పొంగుతోంది. నీవు ఎంత అందంగా సాక్షాత్కరిస్తున్నావంటే నా దేశమాత అంత సుందరంగా. నీవు జయించిన ఒక్కొక్క స్వర్ణం ఒక్కొక్క ఆర్ణవం. పున్నమి రేయి పొంగే జలధి తరంగాల్లా నా హృదయం ఆనంద తరంగాలతో పోటెత్తుతున్నది అజస్ర సహస్ర జోతలివే అందుకొమ్ము ఓ బంగరు కొమ్మా
The post మట్టిలో మాణిక్యం…హిమదాస్ appeared first on Tollywood Superstar.
from Tollywood Superstar https://ift.tt/30LgLCN
via IFTTT
No comments:
Post a Comment