etechlooks

Daily Latest news Channel

Breaking

Thursday, May 23, 2019

కాళ్లు లేకపోతేనేం.. కసి ఉంది.. డెలివరీ బాయ్ ఆత్మవిశ్వాసం..వైరల్ వీడియో

కాళ్లు లేకపోతేనేం.. కసి ఉంది. బ్రతకాలి.. ఎవరిమీదా ఆధారపడకుండా.. ఎవరూ తన మీద జాలిపడకుండా బ్రతకాలి. కాళ్లుండీ.. కష్టపడడం అంటే ఇష్టం లేని వారికి తాను బ్రతికి చూపించాలి. చిన్న చిన్న విషయాలకే జీవితాలను చిధ్రం చేసుకునే వారికి తాను స్ఫూర్తి కావాలి. అన్ని అవయవాలు సక్రమంగా పని చేస్తున్నా అమ్మా నాన్న మీద ఆధారపడుతూ, ఇంకా అడిగిందేదో కొనివ్వలేదని అలిగి ఆత్మహత్య చేసుకునే వారు కొందరైతే, ఎంత ప్రయత్నించినా ఉద్యోగం రావట్లేదని నిరుత్సాహపడిపోతూ డిప్రెషన్‌లోకి వెళ్లేవారు మరికొందరు. అలాంటి వారందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు ఈ జొమాటో డెలివరీ బాయ్. అందరిలా టూ వీలర్‌ మీద రయ్‌మని దూసుకెళ్లలేడు. అయితేనేం గుండె నిండుగా ఆత్మవిశ్వాసం మూడు చక్రాల బండే అతడిని గమ్యస్థానానికి చేరుస్తుంది.

ఫుడ్ డెలివరీ ఆర్డర్ ఇచ్చిన వారికి మోముపై చెరగని చిరునవ్వుతో డెలివరీ పాకెట్ అందిస్తాడు. నా ఆర్డర్ కాస్త ఆలస్యమైనా కస్టమర్ల సహకారమే తనని ముందుకు నడిపిస్తుంది అంటాడు.నెట్టింట్లో హల్ చల్ చేస్తున్న ఈ హంగ్రీ సేవియర్ గురించి హానీ గోయల్ అనే వ్యక్తి వీడియోలో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్ అవుతోంది. తమ జీవితం వ్యర్థం అనుకునే వారు ఈ వ్యక్తి నుంచి నేర్చుకోవలసింది చాలా ఉంది. ఈ వ్యక్తి మరింత ఎదగడానికి జొమాటో సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని హానీ గోయల్ ట్వీట్ చేశారు. క్షణాల్లోనే ఈ ట్వీట్ వైరల్ అయింది. దివ్యాంగుడి ఆత్మవిశ్వాసాన్ని ప్రశంసిస్తూ నెటిజన్స్ నుంచి ట్వీట్ల వర్షం కురుస్తోంది. హానీ గోయల్ ట్వీట్‌పై జొమాటో కూడా స్పందించింది. ఈ వీడియోని షేర్ చేసినందుకు ధన్యవాదాలు. మా ఫుడ్ డెలివరీ బాయ్స్ మాకెంతో గర్వకారణం.

ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కస్టమర్లకు సమయానికి ఆహారాన్ని సరఫరా చేస్తున్నారు అంటూ జొమాటో రిప్లై ఇచ్చింది. అతడి వివరాలు పంపించమంటూ సంస్థ హానీని కోరింది. ట్వీట్‌కి స్పందించిన హానీ అతడి పేరు రాము అని రాజస్థాన్‌కు చెందిన వ్యక్తి అని పేర్కొన్నారు. జీవితం పట్ల ఆశను కల్పిస్తూ అతడికీ ఉద్యోగం ఇచ్చిన జొమాటో సంస్థను ప్రశంసిస్తున్నారు నెటిజన్స్.

The post కాళ్లు లేకపోతేనేం.. కసి ఉంది.. డెలివరీ బాయ్ ఆత్మవిశ్వాసం..వైరల్ వీడియో appeared first on DIVYAMEDIA.



from DIVYAMEDIA http://bit.ly/2QkfTB7

No comments:

Post a Comment