ఇలాంటి వార్తలతో హాస్పిటళ్లపై ఉన్న నమ్మకం కూడా పోయే అవకాశం ఉంది. పంజాబ్ లో ఈ సంఘటన జరిగింది. ఓ 65 ఏళ్ల మహిళను అనారోగ్యం కారణంగా.. కపుర్తలా పట్టణంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు బంధువులు. ఆమె చనిపోయిందని చెప్పిన డాక్టర్లు … శరీరాన్ని మార్చురీలోని ఫ్రీజర్ లో పెట్టారు. ఐతే… ఆమె ఒంటిపై నగలు ఉన్న సంగతి గుర్తొచ్చి.. ఓసారి బాడీని చూపించాలని కోరారు. బంధువులు వెళ్లి మార్చురీ ఫ్రీజర్ లో ఉన్న బాడీని పరిశీలించి.. మెడలోని బంగారు నగలను తీసేందుకు ప్రయత్నించారు. ఆ సమయానికి ఆమె శ్వాసిస్తున్నట్టు తెలిసి షాకయ్యారు. ఆమె బతికే ఉందని డాక్టర్లకు చెప్పారు. వెంటనే డాక్టర్లు ఆమెను ఫ్రీజర్ నుంచి తొలగించి… నీళ్లలో ఉంచి… చల్లదనం తగ్గించారు.
ఆవేదనతో.. ఆమెను అపస్మారకస్థితిలోనే తమ ఇంటికి తీసుకెళ్లారు. మరో హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ఐతే.. అక్కడ చికిత్స పొందుతూ మరుసటి రోజు ఆమె కన్నుమూసింది.మే 15న ఈ సంఘటన జరిగింది. కపుర్తలా పట్టణంలోనే కాదు… పంజాబ్ రాష్ట్రం అంతటా ఈ న్యూస్ వైరల్ అయింది. ప్రాణంతోనే ఉన్న పేషెంట్ ను మార్చురీలో పెట్టడం దారుణమంటూ ప్రైవేటు హాస్పిటల్స్ పై విమర్శలు వచ్చాయి.
The post పంజాబ్ లో దారుణం, బతికున్న మహిళను మార్చురీ ఫ్రీజర్ లో పెట్టేశారు. appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA http://bit.ly/2JqLdNQ
No comments:
Post a Comment