గల్ఫ్ దేశాల్లో పౌర నిబంధనలు ఎంత కఠినంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా తమ దేశానికి వచ్చే విదేశీ పౌరులకు కువైట్ ప్రభుత్వం మరో కొత్త నిబంధనను తీసుకొచ్చింది. పౌర గుర్తింపు కార్డు, పాస్‌పోర్టు రెండింటిలోనూ సంబంధిత వ్యక్తి పేరు ఒకే స్పెల్లింగ్‌తో ఉండాలి. ఒకవేళ రెండు వేర్వేరు స్పెల్లింగ్‌లతో ఉంటే మాత్రం వారిపై దేశ బహిష్కరణ చర్యలు తీసుకోనున్నట్లు ఆ దేశ ప్రభుత్వం ప్రకటించింది. పేరులో స్పెల్లింగ్ తప్పు ఉంటే మాత్రం మార్చుకునేందుకు సుర్రలోని కార్యాలయంలో సంప్రదించాలని సంబంధిత అధికారులు సూచించారు. ఈ అవకాశం బషిష్కరణకు గురైన విదేశీ పౌరులు ఎవరైతే ఇకమా రెన్యూవల్ కోసం మార్చి 10 కంటే ముందే దరఖాస్తు చేసుకున్నారో వారికి మాత్రమేనట. దీనికి సంబంధించిన దరఖాస్తు ఫారాలను సుర్ర కార్యాలయంలోనే ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పొందవచ్చని అధికారులు తెలిపారు. అంతేగాక విదేశీయుల సౌలభ్యం కోసం దరఖాస్తులు సమర్పించడానికి గడువును పొడిగించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అలాగే తమ దేశానికి వచ్చే ప్రతి విదేశీయుడు తప్పనిసరిగా పాస్‌పోర్టుతో పాటు పౌర గుర్తింపు కార్డును కలిగి ఉండాలని కువైట్ అధికారులు ఆదేశించారు.
The post ఈ దేశాలకి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఒక సారి చెక్ చేసుకోండి. ఎందుకంటే ….? appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA http://bit.ly/2Yuugpl
No comments:
Post a Comment