చంద్రుడు క్రమంగా కుచించుకుపోతున్నట్లు పరిశోధనలో తేలింది. చంద్రుడిపై అంతర్గతంగా ఉన్న చల్లదనం, ఇతర కారణాల వల్ల జాబిల్లి చిక్కిపోతోందని అమెరికా పరిశోధకులు తెలిపారు. ఈ పరిణామం ఇప్పుడు మొదలైంది కాదని, కొన్ని వందల మిలియన్ల ఏళ్ల నుంచి కొనసాగుతోందని స్పష్టం చేశారు. ఇప్పటివరకు 150 అడుగుల (50మీటర్ల) కన్నా ఎక్కువ కుచించుకుపోయినట్లు తమ అధ్యయనంలో తేలిందని యూనివర్సిటీ ఆఫ్ మేరీలాండ్ ప్రొఫెసర్, అధ్యయనంలో పాల్గొన్న నికోలస్ వెల్లడించారు.
దీని కారణంగా చంద్రుడి ఉపరితలం ముడుచుకుపోవడంతో పాటు ప్రకంపనలు సంభవించే అవకాశం ఉందని అంచనా వేశారు. నాసాకు చెందిన లూనార్ రీకానిసెన్స్ ఆర్బిటార్ తీసిన 12 వేల చంద్రుడి చిత్రాలను విశ్లేషించిన పరిశోధకులు ఈ విషయాన్ని తెలిపారు. చంద్రుడి ఉత్తర ధృవానికి సమీపంలోని మెరే ఫ్రిగోరిస్ వద్ద కుచించుకుపోయిందని పేర్కొన్నారు. ఎండు ద్రాక్ష మాదిరిగా చంద్రుడు కుచించుకుపోయాడన్నారు. దీని ఫలితంగా ఉపరితలంపై పగుళ్లు ఏర్పడే అవకాశం ఉందన్నారు. భూమికి టెక్టోనిక్ ప్లేట్లు ఉన్నట్లుగా చంద్రుడికి ఉండవు.
అయితే చంద్రుడు ఏర్పడిన 4.5 బిలియన్ సంవత్సరాల నుంచి దాని లోపల వేడి నెమ్మదిగా కోల్పోతుందని, ఫలితంగా టెక్నోటిక్ ప్రక్రియ మొదలైందని పరిశోధకులు తెలిపారు. జాబిల్లి కుచించుకుపోవడానికి ఇదే కారణమన్నారు. ఈ మేరకు నేచర్ జియోసైన్స్ జర్నల్‌లో కథనం ప్రచురితమైంది.
The post వామ్మో ….! సైజు తగ్గిపోతున్న చంద్రుడు, ఆందోళనలో సైంటిస్ట్‌లు. appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA http://bit.ly/2W7rQ2r


No comments:
Post a Comment