సీనియర్ ఎన్టీఆర్ మద్రాసులో ఉండే సమయంలో ఉదయం 4గంటలకు ఆయన ఇంటి ముందు అభిమానులు బారులు తీరేవారు. ఆయనను చూడటం కోసం ఇంటి ముందు ఓపిగ్గా ఉండేవారు. ఇంచు మించు అటువంటి సన్నివేశాలే హైదరాబాద్‌లో జూనియర్ ఎన్టీఆర్ ఇంటి ముందు ఆయన పుట్టినరోజు నాడు కనిపిస్తుంది. టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ తెచ్చుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఈ నెల(మే) 20వ తేదీన 36వ పడిలోకి అడుగుపెట్టబోతున్నారు. అయితే ఈసారి ఎన్టీఆర్ తన పుట్టిన రోజు వేడుకులను జరుపుకోవట్లేదు. అంతేకాదు తన పుట్టినరోజు వేడుకులను అభిమానులు కూడా జరుపుకోవద్దు అంటూ అభిమానులకు సందేశం విడుదల చేశారు.
జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉండడానికి కారణం లేకపోలేదు. ఎన్టీఆర్ తండ్రి నందమూరి హరికృష్ణ గతేడాది ఆగస్ట్ లో రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఆ విషాద సంఘటన జరిగి సంవత్సరం కూడా కాలేదని, ఇటువంటి సమయంలో తనకు పుట్టిన రోజు జరుపుకోవడం ఇష్టం లేదని, అభిమానులు కూడా జరుపుకోవద్దంటూ వివరించారు. అలాగే ఇటీవల తన అభిమాని జయదేవ్ చనిపోగా ఆవేదన వ్యక్తం చేస్తూ లేఖను విడుదల చేసిన సంగతి తెలిసిందే. మరో మూడు రోజుల్లోనే ఎన్టీఆర్ బర్త్ డే ఉండటంతో అభిమానులు భారీగా ప్లాన్ చేశారు. అయితే సామాజిక కార్యక్రమాలు మాత్రం అభిమానులు జరిపే అవకాశం ఉంది. మరోవైపు ఎన్టీఆర్ కొమ్రం భీమ్ గా నటిస్తూ రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్ తర్వాతి షెడ్యూల్ 21వ తేదీ నుంచి జరగనుంది.
The post ఈ సారి నా పుట్టినరోజు వేడుకలు జరపవద్దు..ఎందుకంటే : ఎన్టీఆర్ appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA http://bit.ly/2WgA3lb
No comments:
Post a Comment