etechlooks

Daily Latest news Channel

Breaking

Wednesday, May 22, 2019

Breaking News:గాజువాక ,భీమవరం ,తెనాలి లో జనసేన పార్టీ ముందంజ..సంబరాల్లో పవన్ కళ్యాణ్ అభిమానులు

ఎన్నడూ లేని విధంగా ఈసారి సార్వత్రిక ఎన్నికలు ఎంత హోరా హోరీగా జరిగాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ఎవరు అధికారం లోకి వస్తారు అనేదానిపై ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది..అయితే టీడీపీ ,వైసీపీ పార్టీల మధ్యనే ప్రధాన పోరు జరిగుతుంది అని అందరూ భావించారు..కానీ ఊహించని విధంగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అభ్యర్థులు కూడా చాల కఠినతరమైన పోటీని ఇచ్చారు..ముఖ్యంగా ఉత్తరాంధ్ర ,తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలలో కనివిని ఎరుగని స్థాయిలో వోట్లని నమోదు చేసుకుంది..అయితే ఈ మూడు జిల్లాలో టీడీపీ ప్రభావం అంతంతమాత్రమే అని తెలుస్తోంది..ప్రధానంగా ఈ మూడు జిలాలలో వైసీపీ మరియు జనసేన పార్టీ మధ్య హోరాహోరీగా పోటీ జరిగినట్టు తెలుస్తోంది..ఎట్టకేలకు ఇన్ని రోజులు సర్వేల పేరు తో హోరెత్తించగా ఈరోజు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం అయ్యింది ..

ఇప్పటి వరుకు ఆంధ్రప్రదేశ్ లోని 175 స్థానాలకు గాను 12 స్థానాల్లో పూర్తి స్థాయి కౌంటింగ్ ప్రారంభం అయ్యింది..ఇందులో జనసేన పార్టీ ఎవ్వరు ఊహించని విధంగా టీడీపీ ,వైసీపీ పార్టీఐలతో సరిసమానంగా 3 స్థానాల్లో ముందంజ లో ఉంది..అందులో తెనాలి,గాజువాక ,భీమవరం..దీనితో పవన్ కళ్యాణ్ అభిమానులు సంబరాల్లో ముంగి తేలిపోయారు..ఎగ్జిట్ పోల్ సర్వేస్ అన్ని బూటకం అని మరోసారి నిర్రోపించేందుకు కంకణం కట్టుకోబోతుంది జనసేన పార్టీ..మరి కాసేపట్లో 175 స్థానాల్లో పూర్తి స్థాయిలో కౌంటింగ్ ప్రారంభం కాబోతుంది..ఇందులో జనసేన పార్టీ ఎంత మాత్రం విజయం సాధిస్తుందో అనేది వేచి చూడాలి..ఇది ఇలా ఉండగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం విజయం పట్ల ధీమా గా ఉన్నాడు..ఈరోజు కౌంటింగ్ కేంద్రాల వద్ద తీసుకోవాల్సిన పలు జాగ్రత్తలపై కార్యకర్తలతో ,జనసేన పార్టీ ముఖ్య నేతలతో చర్చలు జరిపారు

ఇది ఇలా ఉండగా సాధారణం గా ఎన్నికల సమయం లో సర్వేల పేరు తో ప్రముఖ సంస్థలు ,మీడియా చానెల్స్ హడావుడి చేసే సంగతి మన అందరికి తెలిసిందే..అయితే ఇటీవల ఎన్నో సర్వేలు మన ముందుకి వచ్చాయి.దాదాపుగా ఆ సర్వేలు అన్ని ఫేక్ అని ప్రతి ఒక్కరికి అర్థం అయ్యే విధంగా తెలుస్తోంది..అయితే ఇటీవల NDTV ఆంధ్ర ప్రదేశ్ లో ఒక్క సర్వే నిర్వహించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం..ఈ సర్వే ఎవ్వరు ఊహించని విధంగా ఆశ్చర్యానికి గురి చేస్తోంది..రాబొయ్యే ఎన్నికలలో జనసేన పార్టీ కి 40 కి పైగా సీట్లు ,వైసీపీ పార్టీ కి 70 కి పైగా సీట్లు ..టీడీపీ పార్టీ కి 55 నుండి 60 సీట్లు రాబోతున్నాయి అట…జనసేన పార్టీ కి ప్రతి జిల్లాలో యువత బ్రహ్మ రథం పట్టబోతున్నట్టు ఈ సర్వేలో తేలింది..యువత వోటింగ్ రికార్డు స్థాయిలో నమోదు అయితే పవన్ కళ్యాణ్ ఈసారి ముఖ్యమంత్రి అయినా ఆశ్చర్యపోనవసరం లేదు అని ఈ సర్వే ద్వారా తేలింది..మరి ఇది ఎంత మాత్రం నియం అనేది తెలియాలి అంటే మరి కొద్దీ గంటలు వేచి చూడక తప్పదు

 

The post Breaking News:గాజువాక ,భీమవరం ,తెనాలి లో జనసేన పార్టీ ముందంజ..సంబరాల్లో పవన్ కళ్యాణ్ అభిమానులు appeared first on Tollywood Superstar.



from Tollywood Superstar http://bit.ly/2EpVTrW
via IFTTT

No comments:

Post a Comment