మీకు ఒక్కడు సినిమా పేరుచెప్పగానే ఛార్మినార్ సెట్ కర్నూలు కొండారెడ్డి బురుజు లైవ్ లొకేషన్ లోనూ ఒక్కడుకి సంబంధించిన కీలక సన్నివేశాల్ని చరిత్ర లో నిలిచిపోయేలా తెరకెక్కించారు దర్శకుడు గుణశేఖర్, ఎప్పుడు ఒక్కడు పేరు టాలీవుడ్ లో గృట్టుకి వచ్చిన ఈ రెండు సీన్లు గృట్టుకు వస్తాయి. ఒక్కడు, సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ ని మలుపు తిప్పిన బ్లాక్ బస్టర్, టాలీవుడ్ లో కొన్ని రికార్డు లను చెరిపి కొత్త రికార్డులు రాసిన సినిమా గ నిలిచింది. అలాంటి కర్నూలు కొండారెడ్డి బురుజు ను మళ్ళీ మనం మహేష్, అనీల్ రావిపూడి కాంబినేషన్ మూవీ సరిలేరు నీకెవ్వరు లో మనం చూడబోతున్నాం.
కొన్ని సన్నివేశాలను కశ్మీర్‌లో చిత్రీకరాన జరుపుకుని ఇటీవల హైదరాబాద్‌లో పనులు ప్రారంభించారు. కొండారెడ్డి బురుజు వద్ద షూటింగ్ ను దగ్గరకు వెళ్లి తీయాలని చుసిన కొన్ని కారణాల వల్ల కుదరలేదు అంట అందుకే రామోజీ ఫిలింసిటీలో ఈ లొకేషన్ ని సెట్స్ రూపంలో చేస్తున్నారని తెలుస్తోంది. మహేష్ తన కెరీర్ లోనే ఈ సారి ఇంకా భారీగా ప్లాన్ చేసినట్లు సమాచారం. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, ఎ.కె ఎంటర్ టైన్ మెంట్స్, జి.ఎం.బి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై దిల్ రాజు, అనిల్ సుంకర, మహేష్ బాబు సంయుక్తంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సరిలేరు నీకెవ్వరు ఎలాంటి బ్లాక్‌బస్టర్ గా నిలవనుందో తెలియాలంటే ఈ సంక్రాంతి వరకు ఆగాల్సిందే.
The post మరోసారి కర్నూలు కొండారెడ్డి బురుజు సెంటర్ appeared first on Tollywood Superstar.
from Tollywood Superstar https://ift.tt/2JZPje0
via IFTTT

No comments:
Post a Comment