etechlooks

Daily Latest news Channel

Breaking

Monday, July 15, 2019

మీరు ఆన్లైన్ లో చీర కొంటున్నారా …? ఈ విషయం తెలిస్తే సచ్చినా కొనరు ఎందుకంటే ….?

భారతదేశంలో స్త్రీలు ధరించే దుస్తులలో ముఖ్యమైనది చీర. దాన్నే కొందరు మోసగాళ్ళు ఆదాయంగా మార్చుకుంటున్నారు, ఆన్‌లైన్‌లో ఆఫర్‌లు టెమ్ట్ చేస్తుంటాయి. ఇక మగువల మనసు దోచే చీరలంటే వార్డ్‌రోబ్‌లో ఎన్ని ఉన్నా మనసు లాగేస్తుంటుంది. కూకట్‌పల్లికి చెందిన ఓ యువతి ఆన్‌లైన్‌లో చీరలు కొందామని ఓ వెబ్‌సైట్ సెలక్ట్ చేసుకుంటోంది. అది చూస్తుండగానే మరింత ఆకర్షణీయమైన చీరలు మరో వెబ్‌సైట్ లింక్ దర్శనమిచ్చింది. ఆ చీరలు విపరీతంగా నచ్చేయడంతో వెంటనే ఆ సైట్లోకి లాగిన్ అయింది. కొన్ని చీరలను సెలక్ట్ చేసుకుంది. తరువాత వెబ్‌సైట్లో సూచించిన విధంగా బ్యాంకు అకౌంట్ నెంబర్, ఫోన్ నెంబర్‌తొ సహా ఇతర వివరాలన్నీ అందులో ఎంటర్ చేసింది. ఈ క్రమంలోనే ఓ గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఆమెకు ఫోన్ వచ్చింది. మేడమ్.. మీ ఆర్డర్ చేరింది.

మా సైట్లో చీరలు కొనుగోలు చేసినందుకు ధన్యవాదాలు అని చెప్పాడు. మీ మొబైల్‌కు మెసేజ్ చేస్తాం. అందులో ఉన్న అంకెలను చెబితే ఆర్డర్ ఓకే చేసుకుంటామని నమ్మించాడు. ఇంతలో మెసేజ్ రానే వచ్చింది. మరో ఆలోచన లేకుండా వారు అడిగిన నెంబర్ చెప్పింది. క్షణాల్లో తన ఖాతా నుంచి రూ.40వేలు ట్రాన్స్‌ఫర్ అయినట్లు మెసేజ్ వచ్చింది. ఒక్కసారిగా షాక్‌కి గురైన ఆమె వెంటనే తేరుకుంది.సైబర్ క్రైమ్ గురించి కాస్త అవగాహన ఉండడంతో వెంటనే తన ఖాతా ఉన్న యాక్సెస్ బ్యాంక్‌కి వెళ్లింది. జరిగిన విషయం బ్యాంకు అధికారులతో చెబతుండగానే మరో రూ.60 వేలు ట్రాన్స్‌ఫర్ అయినట్లు మరో మెసేజ్ వచ్చింది ఆమె ఫోన్‌కి. బ్యాంకు వారికి ఆమెసేజ్ చూపించింది. ఖాతాలోని సొమ్ము యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్) ద్వారా బదిలీ అయినట్లు గుర్తించి ఆమె ఖాతాను బ్లాక్ చేశారు. బాధితురాలు సైబరాబాద్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు టెక్నికల్ ఆధారాలను సేకరించి దర్యాప్తు ప్రారంభించారు.

నేరానికి పాల్పడింది బీహార్ నుంచి కోల్‌కతాలో సెటిల్ అయిన ముఠాగా గుర్తించారు. ఏదైనా వస్తువుని ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసే క్రమంలో బ్యాంక్ ఖాతా, ఫోన్ నంబర్లను టైప్ చేయగానే ఆటోమేటిక్‌గా ఆ వివరాలన్నీ సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కుతున్నాయి. క్షణాల్లో గూగుల్ పే, పేటీఎం లాంటి ఆన్‌లైన్ లావాదేవీలు నిర్వహించే వ్యాలెట్లను సృష్టిస్తున్నారు. లావాదేవీలు చేయడానికి అవసరమైన యూపీఐ నెంబర్ క్రియేట్ చేయడం కోసం ఒకే ఒక్కసారి ఓటీపీ అవసరం అవుతుంది. కేవలం దాన్ని తెలుసుకోవడం కోసమే సైబర్ నేరగాళ్లు బాధితులకు పోన్ చేస్తున్నారు. ఆర్డర్ ఓకే కోసం అని నమ్మించి ఓటీపీ తెలుసుకుంటున్నారు. నెంబర్ చెప్పగాలో అకౌంట్‌లోని డబ్బు గోవిందా. బాధితులు గుర్తించి అకౌంట్‌ని బ్లాక్ చేయించేంతవరకు అందినంత ఊడ్చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. ఇలాంటి ఫోన్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు పోలీసులు. అపరిచితుల ఫోన్ కాల్స్‌కు స్పందించొద్దని, ఎలాంటి వివరాలు అడిగినా చెప్పొద్దని సూచిస్తున్నారు.

రోజుకు రోజుకూ సైబర్‌ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. టెక్నాలజీ పెరుగుతున్న ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ లావాదేవీలు అందుబాటులోకి వచ్చాయి. ఎంతలా అంటే.. టీ తాగినా, టిఫిన్‌ చేసినా స్మార్ట్‌ఫోన్‌ ద్వారా ఆన్‌లైన్‌లో డబ్బులు చెల్లిస్తున్నారు. ఇందుకుగాను వివిధ రకాల వ్యాలెట్లు అందుబాటులోకి వచ్చాయి. వ్యాలెట్లలో టెక్నాలజీని జల్లెడపడుతున్న సైబర్‌ నేరగాళ్లు వాటిలోని టెక్నికల్‌ లోపాలపై పట్టు సాధించి మోసాలకు పాల్పడుతున్నారు. అనేక మార్గాల ద్వారా కస్టమర్ల బ్యాంక్‌ ఖాతా, ఫోన్‌ నంబర్లను సేకరిస్తున్న నేరగాళ్లు ఆన్‌లైన్‌లో యూపీఐ ఖాతాను క్రియేట్‌ చేస్తున్నారు. అందుకు అవసరమైన ఓటీపీ కోసం కస్టమర్లకు ఫోన్‌ చేసి మాటలతో బురిడీ కొట్టించి రాబడుతున్నారు. ఒకసారి ఓటీపీ నంబర్‌ తెలుసుకొని యూపీఐ నంబర్‌ క్రియేట్‌ అయితే చాలు.. ఖాతాదారులతో సంబంధం ఉండదు. మరలా ఓటీపీ అవసరం లేకుండా ఖాతా నుంచి ఎన్ని లావాదేవీలైనా చేయొచ్చు. బాధితులు గుర్తించేలోపు సైబర్‌ చీటర్లు ఖాతాలోని డబ్బంతా కాజేస్తున్నారు. రోజు రోజుకూ పుట్టుకొస్తున్న కొత్త కొత్త వ్యాలెట్ల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ప్రసుతం సైబర్‌ క్రైం పోలీస్టేషన్‌కు యూపీఐ ఫ్రాడ్‌ ఫిర్యాదులు వెల్లువలా వస్తున్నాయని పోలీసులు పేర్కొన్నారు. అపరిచితుల ఫోన్‌ కాల్స్‌కు స్పందించొద్దని, ఎలాంటి వివరాలు అడిగినా చెప్పొద్దని పోలీసులు సూచిస్తున్నారు.

The post మీరు ఆన్లైన్ లో చీర కొంటున్నారా …? ఈ విషయం తెలిస్తే సచ్చినా కొనరు ఎందుకంటే ….? appeared first on DIVYAMEDIA.



from DIVYAMEDIA https://ift.tt/2xNRvj5

No comments:

Post a Comment