అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ద్వారా 1970లో రాజకీయ అధ్యాయం ప్రారంభించిన సుష్మా స్వరాజ్… తన భర్త కౌశల్‌ను తొలుత కలిసింది కాలేజీలో. రాజనీతి శాస్త్రం, సంస్కృతంలో బీఏ చేసిన ఆమె… అనంతరం న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. ఢిల్లీలో లా చదివేటప్పుడు కౌశల్‌తో పరిచయం ఏర్పడింది. నిజానికి ఇద్దరిదీ పూర్తి భిన్నమైన భావజాలం. సుష్మాది ఆర్‌ఎస్‌ఎస్ మూలాలున్న నేపథ్యమైతే… కౌశల్‌ది సామ్యవాద వ్యవస్థను నమ్మే సిద్ధాంతం. లా పట్టా పొందాక ఇద్దరూ కలిసి సుప్రీంకోర్టులో ప్రాక్టీసు ప్రారంభించారు. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించిన సమయంలో కీలకమైన జార్జ్ ఫెర్నాండెజ్ కేసు వాదించిన బృందంలో వారిద్దరూ సభ్యులు. అలా ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది.
కుటుంబ నేపథ్యాలూ… భావాలూ వేరైనా వారి మనసులు కలిశాయి. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ ఇరు వైపుల పెద్దలూ అందుకు ఒప్పుకోలేదు. సుష్మాది సంప్రదాయ హరియాణా కుటుంబం. మరో వైపు అత్యవసర పరిస్థితితో దేశం అట్టుడుకుతున్న కాలం అది. అయితే కౌశల్‌తో కలిసి అడుగులు వేయాలని నిర్ణయించుకున్న ఆమె అవేవీ పట్టించుకోలేదు. చివరకు 1973 జూలై 13న ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. తరువాత కాలంలో కౌశల్ మిజోరాం గవర్నరుగా కూడా పనిచేశారు. సుష్మా మరణానికి కొద్ది రోజుల ముందు… ఈ జంట తమ 44 ఏళ్ల వైవాహిక జీవితాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. సుష్మా-కౌశల్ జంటకు ఒక కుమార్తె… బాన్సురీ స్వరాజ్. ఆమె కూడా న్యాయవాదే.
లోక్‌సభ ఎన్నికల బరి నుంచి సుష్మా స్వరాజ్ తప్పుకున్న సందర్భంలో ఆమె భర్త కౌశల్ చమత్కారాన్ని మేళవించి భావోద్వేగంతో నిండిన ట్వీట్లు చేశారు. ఆ వరుస ట్వీట్లు నెటిజనులను కదిలించాయి. ‘‘మేడమ్ (సుష్మా స్వరాజ్)… ఇక ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయం తీసుకున్నందుకు ధన్యవాదాలు. సమయం ఆసన్నమైనప్పుడు అథ్లెట్ మిల్కా సింగ్ కూడా పరుగు ఆపేసినట్టు గుర్తు. 1977లో నీ మారథాన్ ప్రారంభమైంది. పదకొండుసార్లు ప్రత్యక్ష ఎన్నికల బరిలో నిలిచావు. అంటే పార్టీ అనుమతించని రెండు (1991, 2004) సందర్భాల్లో మినహా 1977 నుంచి ప్రతి ఎన్నికల్లో పోటీ పడుతున్నావు. నాలుగుసార్లు లోక్‌సభకు, మూడుసార్లు రాజ్యసభకు, మూడు పర్యాయాలు రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికయ్యావు. నీ 25 ఏళ్ల వయసులో మొదలైన ఈ మారథాన్ 41 ఏళ్ల పాటు సుదీర్ఘంగా కొనసాగింది.
మేడమ్… నలభై ఆరేళ్లుగా మీ వెంట నేను పరుగెడుతూనే ఉన్నాను. నేనిప్పుడు 19 ఏళ్ల కుర్రాడిని కాను. ఇక పరుగెత్తలేను’ అంటూ కౌశల్ తన భార్యనుద్దేశించి ట్వీట్లు చేశారు. కౌశల్ మనసు పొరల్లో నుంచి వచ్చిన ఆ ట్వీట్లు… అరమరికలు లేని వారి అన్యోన్యత, ఆప్యాయతలకు నిర్వచనం. కెరీర్‌లో సుష్మా, కౌశల్‌లు సాధించిన ఘనతలు ఎన్నో ఉన్నాయి. 27 ఏళ్ల వయసులో సుష్మా జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలయ్యారు. అదే సమయంలో కౌశల్ 34 ఏళ్ల వయసులో అడ్వకేట్ జనరల్‌గా నియమితులై ఆ హోదా దక్కించుకున్న పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించారు. దేశంలో తొలి పూర్తి స్థాయి విదేశీ వ్యవహారాల మంత్రిగా బాధ్యతలు చేపట్టి సుష్మా రికార్డులకెక్కితే… 37 సంవత్సరాలకు గవర్నరయిన అతి పిన్న వయస్కుడిగా కౌశల్ తన పేరు లిఖించుకున్నారు.
The post అందమైన సినిమా కథ లాంటి సుష్మా స్వరాజ్ లవ్ స్టొరీ, ఆ ప్రేమ కథ ఎలా జరిగిందో తెలుసుకోండి. appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA https://ift.tt/2GUSYsz
No comments:
Post a Comment