తమిళనాట మరో దారుణం వెలుగుచూసింది. పసిబిడ్డల్ని అంగడిసరుకులుగా మార్చిన వ్యవహారం గుఫోన్‌కాల్ లీక్‌తో గుట్టురట్టుట్టురట్టయ్యింది. మగబిడ్డ రూ.4లక్షలు, ఆడబిడ్డ రూ.3 లక్షలు, ఎర్రగా ఉంటే ఒక రేటు, నల్లగా ఉంటే మరో రేటు… పైగా బర్త్ సర్టిఫికేట్‌తో ముక్కు పచ్చలారని పసికందుల అమ్మకం ముప్పై యేళ్లుగా అడ్డూ అదుపూ లేకుండా సాగిన దారుణం గురువారం బట్టబయలైంది. ప్రభుత్వ ఆస్పత్రుల నుంచి, నిరుపేద దంపతులు, తల్లిదండ్రుల ఆదరణకు నోచుకోని దంపతుల నుంచి, స్వచ్చంద సంస్థలు నడిపే అనాథాశ్రమాల నుంచి తీసుకొచ్చిన పసికందులను సంతాన భాగ్యానికి నోచుకోని దంపతులకు విక్రయించి ఓ ముఠా కోట్లు గడించింది. నామక్కల్ జిల్లా రాశిపురంలో జరిగిన ఈ పసికందుల అమ్మకం గుట్టు ఒక ఫోన్‌కాల్‌తో రట్టయ్యింది. నామక్కల్ జిల్లాలో మూడు దశాబ్దాలుగా జరుగుతున్న ఈ పసికందుల అమ్మకాలపై రాష్ట్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి బీలా రాజేష్ విచారణకు ఆదేశించారు. పసికందుల విక్రయానికి పాల్పడిన ప్రభుత్వ ఆస్పత్రి రిటైర్డ్ నర్సు అముద, ఆమె భర్త రవిచంద్రన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. నర్సు అముద తన పలుకుబడితో స్వచ్చంద సంస్థలతో సంబంధాలు పెట్టుకుని, వాటి నిర్వాహకుల అండదండలతో, పురపాలక సంఘం అధికారుల మద్దతుతో జోరుగా పసికందులను విక్రయించినట్ట్లు ఆరోపణలు వస్తున్నాయి. 30 ఏళ్లుగా ఆమె పసికందుల విక్రయం ముఠాకు ఏజెంటుగా పనిచేసినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది.
ఫోన్‌కాల్‌తో గుట్టురట్టు
రిటైర్డ్ నర్సు అముదా సేలం జిల్లా ఓమలూరు ప్రాంతానికి చెందిన సంతానం లేని ఓ మహిళతోను, ధర్మపురికి చెందిన సతీష్ అనే వ్యక్తితోనూ సంభాషణలు జరుపుతున్న ఫోన్‌కాల్ ఆడియో గురువారం వాట్సప్, ఇతర సామాజిక ప్రసార మాధ్యమాల్లో వెలువడడంతో ఈ గుట్టు రట్టయ్యింది. పసిబిడ్డ రంగు, బరువును బట్టి ధరను నిర్ణయిస్తున్నామని, మగబిడ్డ అయితే కనీసం నాలుగు లక్షల రూపాయలు, ఆడబిడ్డ అయితే మూడు లక్షల ధరకు విక్రయిస్తామని, అంతే కాకుండా రూ.70 వేలు చెల్లిస్తే రాశిపురం పురపాలక సంఘం నుంచి బిడ్డకు జనన ధ్రువీకరణ పత్రం కూడా తీసిస్తామని నర్సు చెప్పడం స్పష్టంగా ఆ ఆడియోలో నమోదై ఉంది. దీంతో పోలీసులు అప్రమత్తమై ప్రాథమిక విచారణ అనంతరం నర్సు అముదను నిర్బంధంలోకి తీసుకుని విచారణ జరిపారు. పసికందుల విక్రయంలో ఓ పెద్ద ముఠా పనిచేస్తోందని, పసికందులను విక్రయించే ఆ ముఠా ముఖ్యంగా ఇతర జిల్లాలకు చెందిన పసికందులను దొంగిలించి విక్రయించినట్టు తెలుస్తోంది.
ఈ ముఠా వద్ద పసికందులు ఉన్నట్టు తెలియగానే నర్సు అముదా ఆ వివరాలు సేకరించి, సంతానం లేని దంపతులు గురించి తెలుసుకుని వారికి విక్రయించేదని చెబుతున్నారు. సంతానం లేని దంపతులు గుట్టుచప్పుడు కాకండా పసికందులను కొనుగోలు చేసి వెళ్లిపోతుంటారని తెలుస్తోంది. రాశిపురం కేంద్రంగా భారీ యెత్తున జరిగిన ఈ పసికందుల అమ్మకం ప్రస్తుతం రాష్ట్రంలో తీవ్ర సంచలనం కలిగిస్తోంది.
ఇంతకీ ఆడియోలో ఏముంది?
ప్రసారమాధ్యమాల్లో వెలువడిన ఆడియో రిటైర్డ్ నర్సు అముద, ధర్మపురికి చెందిన సతీష్ అనే వ్యక్తి మధ్య జరిగిన సంభాషణలు వున్నాయి. తొలుత అముదా మీకు ఆడబిడ్డ కావాలా మగబిడ్డ కావాలా అని ప్రశ్నించడం, ఏ బిడ్డ అయినా ఫర్వాలేదు, రంగు, ఆరోగ్యం బాగుండాలని సతీష్ చెప్పడం, ఎరుపురంగు, ఆరోగ్యంతో కూడిన బిడ్డ కావాలంటే రూ.4.25 లక్షలు చెల్లించాలని, ఆడబిడ్డ అయితే రూ.3.3 లక్షలు చెల్లిస్తే చాలునని ఆమె సమాధానం చెబుతుంది. బిడ్డకు బర్త్ సర్టిఫికేట్ ఎలా సంపాదించాలని సతీష్ అడిగితే, రాశిపురం మున్సిపాలిటీ నుంచి తాను సులువుగా బర్త్ సర్టిఫికెట్ తీసిస్తానని, అందుకు మరో రూ. 70 వేలు చెల్లించాలని ఆమె చెబుతుంది. తొలుత రాశిపురానికి వచ్చి తనను కలుసుకుని టోకెన్ అడ్వాన్స్ ఇస్తే చాలు, మిగతా పనులన్నీ వారంలో పల పూర్తి చేస్తానని అముద తెలుపుతుంది.
భర్తతో సహా అముద అరెస్టు
ఇదిలా వుండగా, గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నర్సు అముద వద్ద పోలీసులు జరిపిన విచారణలో ఆమె నేరాలను అంగీకరించినట్టు తెలుస్తోంది. దీనితో గురువారం సాయంత్రం అముదను పోలీసులు అరెస్టు చేశారు. పసికందుల విక్రయంలో అముద భర్త రవిచంద్రన్‌కు సంబంధాలు వున్నట్టు రుజువు కావడంతో ఆయనను కూడా అరెస్టు చేశారు. పోలీసుల విచారణలో తొలుత తాను ముగ్గురు పసిబిడ్డలనే విక్రయించానని నర్సు అముద బుకాయించినా, ఆ తర్వాత యేళ్లతరబడి బిడ్డలను అమ్మినట్టు అంగీకరించింది. నామక్కల్ ఎస్పీ అరుళరసన్ ఎదుట గురువారం మధ్యాహ్నం హాజరై ఆమె వాంగ్మూలం ఇచ్చారు. నర్సు అముదతో సంబంధం కలిగిన స్వచ్చంద సంస్థల నిర్వాహకుల వివరాలను సేకరించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. వారి వద్ద విచారణ జరిపితేనే పసిబిడ్డల విక్రయం ఎన్నేళ్లుగా సాగుతోందన్న విషయం బయటపడుతుందని భావిస్తున్నారు.
పురపాలకం సంఘం కుమ్మక్కు
పసికందుల విక్రయం ముఠాతో రాశిపురం పురపాలక సంఘం అధికారులు కుమ్మక్కయినట్టు నర్సు అముద సంభాషణలున్న ఆడియో రుజువు చేస్తోంది. నర్సు అముద చోరీ చేసుకొచ్చిన పసికందులకు పురపాలక సంఘం అధికారులు భారీగా ముడుపులు స్వీకరించి బర్త్ సర్టిఫికెట్లను మంజూరు చేశారని తెలుస్తోంది. ఆడియోలో నర్సు అముద పసికందులకు రాశిపురం మున్సిపాలిటీ నుంచి బర్త్ సర్టిఫికేట్ తీసివ్వడానికి రూ.75వేలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్న సంభాషణలు కూడా వున్నాయి. దీనితో పసికందుల విక్రయంలో పాలుపం చుకున్న పురపాలక సంఘం అధికారుల వివరాలను తెలుసుకునేందుకు కూడా పోలీసు అధికారులు ప్రయత్నిస్తున్నారు.
The post అక్కడ 30 ఏళ్లుగా దారుణం.. ఫోన్‌కాల్ లీక్‌తో గుట్టురట్టు, అంగడిసరుకుగా పసిబిడ్డ! ఇంతకీ ఆడియోలో ఏముంది? appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA http://bit.ly/2IKhK12
No comments:
Post a Comment