etechlooks

Daily Latest news Channel

Breaking

Friday, April 26, 2019

అక్కడకు వెళ్లిన వారి సెల్‌ఫోన్లు మాయం.. డబ్బు మాత్రం సేఫ్..! ఇంతకీ ఎక్కడో తెలుసా …?

వారపు సంతకు వెళుతున్నారా… సెల్‌ఫోన్‌ జాగ్రత్త. ప్రతి వారం నిర్వహించే సంతలో సెల్‌ఫోన్లు చోరీకి గురవుతున్నాయి. సెల్‌ఫోన్లతో సంతకు వెళ్లాలంటే బయపడాల్సిన పరిస్థితి నెలకొంది. పట్టణంలో ప్రతి శుక్రవారం వారపు సంతను నిర్వహిస్తారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి రైతులు కూరగాయలతో ఏర్పాటుచేసే ఈ సంతకు పట్టణవాసులే కాక గ్రామీణ ప్రాంతాల నుంచి చౌకగా లభించే కూరగాయలు కొనుగోలుకు పెద్దఎత్తున తరలివస్తారు. గతంలో దిన మార్కెట్‌లోనే సంతను నిర్వహించేవారు. మున్సిపల్‌ భవన నిర్మాణ ఏర్పాట్లలో భాగంగా సంతను బళ్లారి రోడ్డుకు తరలించారు. ప్రధాన రహదారిలో విపరీతమైన జనరద్దీతో ఉన్న సంతలో సెల్‌ఫోన్లు మాత్రమే చోరీకి గురవుతున్నాయి. గత కొంతకాలంగా ఇది కొనసాగుతూనే ఉంది. పోలీసులు అప్రమత్తం కావడంతో కొద్దిరోజులు చోరీలు తగ్గినా, ఎన్నికల హడావుడిలో అధికారులు ఉండడంతో చోరీలు మళ్లీ అధికమయ్యాయి.

5వ తేదీన వారపు సంతలో ఆరుగురికి సంబంధించిన విలువైన సెల్‌ఫోన్లు మాయమయ్యాయి. సెల్‌ఫోన్లు ఇంట్లోనే ఉంచి సంతకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. నగదు జోలికి పోకుండా కేవలం జేబులో ఉన్న సెల్‌ఫోన్‌లు మాత్రమే మాయమవుతుండడంతో సంతకు వచ్చిన వారు బెంబేలెత్తుతున్నారు. గతంలో ఓ ఉపాధ్యాయుడు, ఇద్దరు వ్యాపారులు, ఓ మహిళకు సంబంధించిన విలువైన సెల్‌ఫోన్లు చోరీకి గురయ్యాయి. సెల్‌ఫోన్లు మాత్రమే మాయమవడం, ఫోన్‌ చేస్తే నెట్‌వర్క్‌ దాటి పక్క రాష్ట్రాల నెట్‌వర్క్‌లో ఉండడంతో అసలు చోరీ చేస్తున్న వారెవరో అంతుచిక్కడం లేదు. అందుకే ఇక్కడ సంతకు వెళ్లాలంటే సెల్‌ఫోన్‌లు ఇంట్లోనే పెట్టాల్సిందే. పోలీసులకు సైతం అంతుచిక్కని ప్రశ్నగా మారింది. సంతలో నిఘా పెంచి ప్రజలకు భద్రత కల్పించాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని ప్రజలు అంటున్నారు.

The post అక్కడకు వెళ్లిన వారి సెల్‌ఫోన్లు మాయం.. డబ్బు మాత్రం సేఫ్..! ఇంతకీ ఎక్కడో తెలుసా …? appeared first on DIVYAMEDIA.



from DIVYAMEDIA http://bit.ly/2IUFnmY

No comments:

Post a Comment