కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా తనను టార్గెట్ చేసుకుని.. యూట్యూబ్ వేదికగా దుష్ప్రచారానికి పాల్పడుతున్నారంటూ సినీనటి పూనమ్‌కౌర్ హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంగళవారం స్వయంగా సీసీఎ్‌సకు వచ్చిన ఆమె.. ఓ 50 యూట్యూబ్ చానళ్లు అసభ్యకరమైన పోస్టులు చేస్తున్నాయని, వీడియోలను అప్‌లోడ్ చేశాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయా చానళ్లను నిర్వహిస్తున్నట్లుగా అనుమానిస్తున్న కొందరు వ్యక్తుల పేర్లను పోలీసులకు తెలిపినట్లు సమాచారం. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. రెండేళ్లుగా యూట్యూబ్ చానళ్లు తన పేరుతో వీడియో లింక్స్ పెడుతున్నాయని, ఇదంతా రాజకీయ లబ్ధి కోసమే కొందరు వ్యక్తులు చేస్తున్నారని ఆరోపించారు. వీటివల్ల రెండేళ్లుగా మానసిక క్షోభను అనుభవిస్తున్నానని, యూట్యూబ్ చానళ్ల అతి హద్దుమీరడంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వివరించారు. రాజకీయంగా ఎదగడానికి ఒక మహిళ వ్యక్తిత్వాన్ని కించపరచడం దారుణమన్నారు.
ఆ వీడియోల్లో ఏముంది?
జనసేన అధినేత పవన్ కల్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్, పూనమ్‌కౌర్‌ను టార్గెట్ చేసుకుంటూ.. ఓ ఆడియో క్లిప్‌ను జోడించిన వీడియో కొంతకాలంగా యూట్యూబ్, సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ఆడియోలో పవన్ కల్యాణ్‌పై పూనమ్‌కౌర్ తీవ్రంగా ఆరోపణలు చేసినట్లు ఉంది. దాన్ని కొందరు సెలబ్రిటీలు, వివాదాస్పద తారలు కూడా షేర్ చేశారు. గతంలోనూ వివాదాస్పద నటి శ్రీరెడ్డి, సినీ విమర్శకుడు కత్తి మహేశ్ పూనమ్‌కౌర్‌పై వ్యాఖ్యలు చేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది.
The post 50 చానళ్లు నన్ను టార్గెట్ చేసుకున్నాయి, రెండేళ్లుగా మానసిక క్షోభను అనుభవిస్తున్నా : పూనమ్‌కౌర్ appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA http://bit.ly/2VNIHUE
No comments:
Post a Comment