‘‘నాంపల్లి రైల్వేస్టేషన్‌కు ఇకపై ఒంటరిగా వెళ్లను. ఎవరైనా తోడు ఉంటేనే వెళతాను. అక్కడికి ఎవరూ ఒంటరిగా వెళ్లకపోవడమే మంచిది’’ అంటూ మతిస్థిమితం కోల్పోయి సాధారణస్థితికి చేరుకున్న వైద్యురాలు సునందా సాహి విలేకరులతో చెప్పిన మాటలు సంచలనం సృష్టిస్తున్నాయి. నాంపల్లి రైల్వేస్టేషన్‌లో ఏ పరిస్థితిలో దొరికింది. అక్కడ ఏం జరిగి ఉంటుందో తెలుసుకోవడానికి విలేకరులు ప్రయత్నించగా కన్నీటి పర్యంతమవుతూ ఆమె ఈ విధంగా వ్యాఖ్యానించారు. దీంతో అక్కడ ఏం జరిగి ఉంటుందనేది మిస్టరీగా మారింది. మతిస్థితిమితం కోల్పోయి కస్తూర్బాగాంధీ ఆశ్రమంలో చికిత్స తీసుకున్న డాక్టర్ సునందను సైబరాబాద్ షీ టీమ్స్ డీసీపీ అనసూయ, కస్తూర్బా ట్రస్టు ఆశ్రమం ఇన్‌చార్జ్ పద్మావతి కలిసి ఆమె మేనత్తకు మంగళవారం అప్పగించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసుకు సంబంధించిన వివరాలు తెలియజేశారు. యూపీలోని వారాణసీకి చెందిన సునంద మతిస్థిమితం కోల్పోయి 2017లో నాంపల్లి పోలీసులకు కనిపించగా.. వారు ఆమెను కస్తూర్బాగాంధీ అనాథాశ్రమంలో చేర్పించారు. అంతకుముందు నగరంలోని మొయినాబాద్‌లో వీఆర్‌కే మెడికల్ కళాశాలలో మెడిసిన్ పూర్తి చేసిన విషయం తెలిసిందే. అయితే పూర్తిగా కోలుకున్న తర్వాత సునంద మేనత్త అల్కారాయ్‌ను వారాణసీ నుంచి పిలిపించి ఆమెకు అప్పగించారు.
సునంద తప్పిపోయిన ఘటనపై వారాణసీ ఠాణాలో ఫిర్యాదు చేశామని, వారాణసీ, హైదరాబాద్‌లోనూ వెతికామని సునందా మేనత్త తెలిపారు. మరోవైపు తాను డాక్టర్‌గా కొనసాగుతూ ప్రజలకు వైద్య సేవలందిస్తానని సునంద స్పష్టం చేశారు. అయితే సునందకు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? నాంపల్లిలో ఏం జరిగిందో ఆధారాలు దొరకడం లేదని డీసీపీ అనసూయ తెలిపారు. ఏదైనా ఆధారం దొరికితే విచారణ చేపడతామన్నారు. కాగా, సునందను మెంటల్ ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించగా ఒప్పుకోలేదని ఆశ్రమం ఇన్‌చార్జ్ పద్మావతి తెలిపారు. డీసీపీ అనసూయతో చొరవతోనే ఆమెను కుటుంబసభ్యులకు అప్పగించగలిగినట్లు పేర్కొన్నారు
The post నాంపల్లి స్టేషన్‌కు ఒంటరిగా వెళ్లొద్దు! డాక్టర్ జీవితంలో మూడేళ్లు మాయం! ఎలానో తెలుసా ..!? appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA http://bit.ly/2DgdCSk


No comments:
Post a Comment