etechlooks

Daily Latest news Channel

Breaking

Wednesday, April 17, 2019

ఆశిష్ నెహ్రాపై విరుచుకుపడుతున్న బెంగళూరు అభిమానులు, ఇంతకీ నెహ్రా ఏం చేసాడో తెలుసా ..?

ఐపీఎల్‌లో భాగంగా గతరాత్రి ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయం అంచున నిలిచి క్రమంగా ఓటమి ఒడిలోకి జారుకుంది. జట్టు ఓటమికి కారణం కోచ్ ఆశిష్ నెహ్రానే కారణమంటూ అభిమానులు విరుచుకుపడుతున్నారు. గెలుపు ముంగిట నిలిచిన జట్టును నెహ్రా ఓటమి కోరల్లోకి నెట్టేశాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా అతడిని ట్రోల్ చేస్తున్నారు.


సోమవారం రాత్రి ముంబైతో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు 171 పరుగులు చేసింది. 172 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై విజయం కోసం తీవ్రంగా శ్రమించింది. చివరి రెండు ఓవర్లలో విజయానికి 22 పరుగులు అవసరం. క్రీజులో హార్దిక్ పాండ్యా, పొలార్డ్ ఉన్నారు. దీంతో 19వ ఓవర్‌‌ను పేసర్ నవదీప్ సైనీతో వేయించాలని కోహ్లీ భావించాడు. అయితే, బౌలింగ్ ఆశిష్ నెహ్రా మాత్రం పవన్ నేగీతో వేయించాలని డగౌట్ నుంచి సూచించాడు. నెహ్రా సూచన మేరకు పవన్ నేగీకి కోహ్లీ బంతిని అందించాడు. స్ట్రైకింగ్‌లో ఉన్న పాండ్యా.. నేగి బౌలింగ్‌ను చీల్చి చెండాడు. విజయానికి అవసరమైన 22 పరుగులను పిండుకుని మరో ఓవర్ మిగిలి ఉండగానే విజయాన్ని అందించిపెట్టాడు.

ఇది చూసిన బెంగళూరు అభిమానులు నెహ్రాపై మండిపడుతున్నారు. జట్టు ఓటమికి అతడే కారణమంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. పాండ్యా, పొలార్డ్ వంటి బ్యాట్స్‌‌మెన్ క్రీజులో ఉన్నప్పుడు నేగీలాంటి స్పిన్నర్లకు బౌలింగ్ ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. 19వ ఓవర్‌ను నేగీకి ఇచ్చి ఉంటే ఫలితం మరోలా ఉండేదని అంటున్నారు. నెహ్రా తలచుకుంటే స్టేట్‌ టాపర్‌ను కూడా ఫెయిల్ చేస్తాడంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

The post ఆశిష్ నెహ్రాపై విరుచుకుపడుతున్న బెంగళూరు అభిమానులు, ఇంతకీ నెహ్రా ఏం చేసాడో తెలుసా ..? appeared first on DIVYAMEDIA.



from DIVYAMEDIA http://bit.ly/2Dt7KFx

No comments:

Post a Comment