`అందాల రాక్షసి` సినిమాలో అద్భుతంగా నటించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నాడు హీరో నవీన్ చంద్ర. ఆ తర్వాత పలు సినిమాల్లో హీరోగా నటించాడు. అయితే అవన్నీ పరాజయాలుగానే నిలిచాయి. ఇక, హీరోగా అవకాశాలు రాకపోవడంతో నాని నటించిన `నేను లోకల్` సినిమాలో విలన్ పాత్ర పోషించాడు. ఆ సినిమా కూడా ఆశించిన బ్రేక్ ఇవ్వలేదు.
అలాంటి సమయంలో వచ్చిన `అరవింద సమేత` నవీన్‌కు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో ఎన్టీయార్ నటించిన ఆ సినిమాలో నవీన్ విలన్‌గా నటించాడు. ఆ సినిమా ఇచ్చిన గుర్తింపుతో ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తున్నాడు. తాజాగా జరిగిన తన నూతన సినిమా ప్రారంభోత్సవ వేడుకలో `అరవింద సమేత` గురించి నవీన్ మాట్లాడాడు. `వరుసగా ఫ్లాప్‌లు వచ్చిన సమయంలో నాకు `అరవింద సమేత` ఆఫర్ వచ్చింది. నేను క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు బాలిరెడ్డి పాత్ర చేయమని త్రివిక్రమ్‌గారు, ఎన్టీయార్‌గారు అడిగారు. దాంతో నాకు మళ్లీ జీవం వచ్చినట్టు అయింది. నా కెరీర్ మళ్లీ ప్రారంభమైంది. ఆ సినిమాలో ఎన్టీయార్, త్రివిక్రమ్ ఛాన్స్ ఇవ్వకపోయుంటే నా పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోలేన`ని నవీన్ అన్నాడు.
The post ఎన్టీయార్ వల్లే నా కెరీర్ నిలబడింది: నవీన్ చంద్ర appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA http://bit.ly/2VNEoZm
No comments:
Post a Comment