etechlooks

Daily Latest news Channel

Breaking

Tuesday, April 16, 2019

వేసవి కాలం లో కోడి కుర తింటున్నారా..? అయితే ఈ వ్యాదులు రావడం ఖాయం….?

చికెన్ ఎక్కువ మంది తినే మాంసాహారం. చాలా తక్కువ కాస్ట్ లో సులువుగా దొరికే నాన్ వెజ్ ఇదే. చికెన్ ప్రొటీన్ ని ఇస్తుంది. ప్రొటీన్ బలాన్ని ఇస్తుంది. అందుకే బాడి బిల్డర్స్ మరో ఆలోచన లేకుండా చికెన్ మీదే ఆధారపడతారు. మరి చికెన్ వేడి చేస్తుంది అంటారు కదా? వేసవి వచ్చిందంటే చాలు చర్చలు మొదలవుతాయి. చికెన్ ఎక్కువ తినొద్దని, గుడ్లు కూడా ఈ రెండు మూడు నెలలు మానేయాలని, లేదంటే ఒంట్లో వేడి కంట్రోల్ అవదని అంటారు. మరి ఇందులో నిజమెంత?

అసలు చికెన్ నిజంగానే ఒంట్లో వేడి పెంచుతుందా? అదే నిజమైతే మరి జిమ్ చేసేవారి పరిస్థితి ఏంటి? వాళ్ళు చికెన్ తినడం మానేస్తే పనులు ఎలా జరిగేవి?మెటాబాలిజం రేట్ అంటే ఏంటో తెలుసా? సాధారణ భాషలో చెప్పాలంటే, తిన్నది జీర్ణం అయ్యే ప్రాసెస్. ప్రోటీన్ అంత త్వరగా జీర్ణం కాదు. అలాగే అంత సులువుగా కూడా కాదు. ప్రోటీన్ ఆహారం ఎక్కువగా తీసుకుంటే, మన శరీరం అదనపు శక్తి కూడతీసుకోని, మెటబాలిజం రేట్ ని వేగవంతం చేస్తుంది‌. అలా జరిగితే తప్ప ప్రోటీన్ జీర్ణం కాదు మరి. ఈ మెటబాలిజం రేట్ పెరగటం వలన శరీరంలో వేడి పెరగటం కూడా వాస్తవమే. ఇది, చికెన్ తింటే వేడి పుడుతుంది అనే చర్చ వెనుక సైన్స్ చెప్పే సత్యం. అయితే..అలా అని జిమ్ చేసేవారు చికెన్, గుడ్లు మానేయాల్సిన అవసరం లేదు. వర్కవుట్స్ వలన ఒంట్లో వేడి తగ్గుతూనే ఉంటుంది. ప్రోటీన్ మీ వర్కవుట్ అవసరం.

అది మాంసం ద్వారా తీసుకుంటారా, పౌడర్ ద్వారా తీసుకుంటారా లేక ప్లాంట్ ప్రొటీన్ పైనే ఆధారపడతారా మీ ఇష్టం. బాడి టెంపరేచర్ మీద మీకు భయం ఉంటే పక్కనపెట్టాల్సింది, లేదా తీసుకోవడం తగ్గించాల్సింది కేవలం చికెన్, గుడ్ల వరకే కాదు, కారం ఎక్కువగా వాడకూడదు, మసాలా వంటకాలకి కూడా దూరంగా ఉండాలి. మీరు ఎలాంటి వర్కవుట్ చేయకపోయినా, మితంగా ప్రోటిన్ తీసుకుంటూనే ఉండవచ్చు.

The post వేసవి కాలం లో కోడి కుర తింటున్నారా..? అయితే ఈ వ్యాదులు రావడం ఖాయం….? appeared first on DIVYAMEDIA.



from DIVYAMEDIA http://bit.ly/2P9QZUn

No comments:

Post a Comment