etechlooks

Daily Latest news Channel

Breaking

Tuesday, April 16, 2019

సోంపు తినడం వల్ల ఎన్ని ప్రయోజనాలున్నయో తెలుసా…?

సోంపులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. సోంపును నమలడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. వంద గ్రాముల సోంపులో 39 గ్రాముల ఆహార సంబంధిత పీచు ఉంటుంది. దీనివల్ల మనం తీసుకున్న ఆహారం తేలికగా జీర్ణమవుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. బాలింతలకు సోంపును వేడినీటిలో మరిగించి ఇస్తే ఆ నీటిని తాగడం వల్ల బిడ్డకు పాలు బాగా అందుతాయి. దగ్గు వదలకుండా వేధిస్తున్నప్పుడు ఒక చెంచాడు సోంపును నమలడం వల్ల దగ్గునుండి ఉపశమనాన్ని పొందవచ్చు. కీళ్ల నొప్పులు ఉన్నవారు సోంపు నూనెతో మర్దన చేసుకుంటే ఉపశమనం లభిస్తుంది. సోంపులో ఇనుము, రాగి, జింక్‌, పొటాషియం వంటి ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి.

ఇవి ఎర్రరక్తకణాలు ఏర్పడడానికి తోడ్పడతాయి. జింకు పాళ్లు ఎక్కువగా ఉండడం వల్ల అది మన శరీరంలోని ఎంజైముల పనితీరును మెరుగుపరచి, జీవక్రియలు సక్రమంగా సాగేలా చూస్తుంది. సోంపులో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువగా ఉంటాయి. అవి శరీరానికి హానికలిగించే ఫ్రీరాడికల్స్‌ చర్యలను నిరోధిస్తాయి. దీని ఫలితంగా ఇన్‌ఫెక్షన్లు దూరం కావడంతోబాటు మన ముఖంలో వృద్దాప్యానికి సంబంధించిన ఛాయలను కూడా దూరంగా ఉంచుతుందట.

The post సోంపు తినడం వల్ల ఎన్ని ప్రయోజనాలున్నయో తెలుసా…? appeared first on DIVYAMEDIA.



from DIVYAMEDIA http://bit.ly/2UCPzYl

No comments:

Post a Comment