పాకిస్తాన్‌లో ఓ వ్యక్తి క్రూరంగా ప్రవర్తించాడు. పావురాల పందెంలో ఓడిపోయాననే కోపంతో తన ఇంటిపైన ఉన్న పావురాల పంజరానికి నిప్పంటించి వందలాది పావురాల ప్రాణాలను బలిగొన్నాడు. పాకిస్తాన్‌లో పావురాలను ఎక్కువగా బ్రీడింగ్‌కు, రేసింగ్‌కు వాడతారు. కబూతార్ బాజీ(పావురాల రేసింగ్) పేరిట పాకిస్తాన్‌లో రేసింగ్‌లు నిర్వహిస్తుంటారు. ఈ రేసింగ్‌లో పావురాలు దాదాపు 12 గంటలపాటు తిండి, నీళ్లు లేకుండా గాల్లోనే ఎగురుతుంటాయి. సంక్రాంతి కోసం కోడిని ఏ విధంగా మేపుతారో.. అక్కడ పావురాలను కూడా ఈ రేసింగ్ కోసం అదే విధంగా మేపుతారు. ఇటీవల జరిగిన రేసింగ్‌లో ఫైసలాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి పాల్గొన్నాడు. అయితే ఆ పందెంలో తన పావురం ఓడిపోవడంతో.. ఇంతకాలం ఖర్చుపెట్టిన డబ్బుతో పాటు, తన పరువు పోయిందని ఆవేదన చెందాడు. ఏం చేయాలో తెలియక ఇంటికి వెళ్లాడు.
ఇంటిపైన ఉన్న పావురాలను చూసి.. వీటివల్లే తనకు మనశ్శాంతి లేకుండా పోయిందంటూ దగ్గర్లో ఉన్న పెట్రోల్ తీసుకుని పావురాలు ఉన్న పంజరానికి నిప్పంటించాడు. స్థానికంగా ఉన్న ఓ వ్యక్తి ఫొటోలు తీసి ట్విటర్‌లో పోస్ట్ చేయడంతో ఈ వార్త వెలుగులోకి వచ్చింది. పావురాలు దాదాపు 10 నిమిషాల పాటు కేకలు వేశాయని.. మూగజీవులను అలా చూసి తన గుండె కరుక్కుపోయిందని స్థానికుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఇలాంటి వాళ్లపై కఠిన చర్చలు తీసుకోవాలని అతనితో పాటు నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. కాగా, రేసింగ్‌లో ఓడిపోయిన అనేక పావురాలను పందెం రాయుళ్లు ఇలానే పెట్రోల్ పోసి నిప్పంటించి వాటిని చంపేస్తారు.
The post వందలాది పావురాలను పంజరంలో పెట్టి.. పెట్రోల్ పోసి..దారుణంగా …! appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA http://bit.ly/2VNFaFK
No comments:
Post a Comment