కడప జిల్లా మైలవరంలోని డాడీహోంలో అనాథ బాలిక సలోని అనే నాలుగేళ్ల చిన్నారిని అమెరికాకు చెందిన దంపతులు దత్తత తీసుకున్నట్లు డాడీహోం నిర్వాహకులు రాజారెడ్డి సోమవారం తెలిపారు. చిన్నారి సలోనిని జిల్లా కలెక్టర్ హరికిరణ్‌కు అప్పగించి అక్కడి నుంచి జిల్లా అధికారుల చేతుల మీదుగా అమెరికా దంపతులకు ఇచ్చారు. రాజారెడ్డి కథనం మేరకు.. తిరుపతిలో మానసిక వికలాంగురాలైన ఓ పిచ్చితల్లి ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఒకటిన్నర నెల వయసున్న పసిగుడ్డును చేతుల్లో పెట్టుకుని తిరుపతి వీధుల్లో అమాయకంగా తిరుగుతుండేది. బిడ్డ పాలకోసం అలమటిస్తూ ఏడుస్తున్నా ఆ బిడ్డకు పాలివ్వాలన్న విషయం కూడా ఆ తల్లికి తెలిసేది కాదు. దీనిని గమనించి ఎవరో ఆ పసికూనను ఆదరించారు. అయితే ఆడపిల్ల అనుకున్నారో ఏమో, గుర్తుతెలియని వ్యక్తులు కడప జిల్లా మైలవరంలో డాడీహోంలో మూడేళ్లక్రితం వదిలిపెట్టి వెళ్లారు.
డాడీహోంలో ఆ పసికూనకు సలోని అని పేరుపెట్టి పెంచుతున్నారు. ఈ నేపథ్యంలో దత్తత ఇచ్చేందుకు సలోని వివరాలను కడప జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ద్వారా, శిశుగృహం ద్వారా ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లో ఉంచారు. దత్తత పిల్లలకోసం అన్వేషిస్తున్న అమెరికా చెందిన బ్రాండెన్ కిత్ ఫ్లిన్, సారా రూత్ ఫ్లిన్ దంపతులకు సలోని నచ్చింది. దీంతో వారు దత్తత తీసుకోవడానికి ముందుకు వచ్చారు. దానికి అనుగుణంగా చట్టప్రకారం భారత, అమెరికా ప్రభుత్వ నియమ నిబంధనల మేరకు అధికారులు డాక్యుమెంట్లను సిద్ధం చేశారు. సోమవారం కడప జిల్లా మహిళా శిశుసంక్షేమ శాఖ పీడీ పద్మజ, అదనపు పీడీ ఆదిలక్షుమ్మ, జిల్లా బాలల సంరక్షణ అధికారి శివప్రసాద్‌రెడ్డి చేతుల మీదుగా అమెరికా దంపతులకు చిన్నారిని అప్పగించారు. ఈ కార్యక్రమంలో డాడీహోం కార్యనిర్వహణ అధికారి లక్ష్మిప్రసన్న, అడ్మినిస్ట్రేటర్స్ కిరణ్మయి, జయరాజు పాల్గొన్నారు.
The post ఆన్‌లైన్‌లో చూసి.. అమెరికా నుంచి వచ్చి.. నాలుగేళ్ల చిన్నారిని…..! appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA http://bit.ly/2Djpwe3
No comments:
Post a Comment