బాదంలలో చాలా ఎక్కువ పోషకాలు ఉంటాయి, ముఖ్య పోషకపదార్థాలైన ప్రొటీన్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, ఒమేగా-6 ఫ్యాటీయాసిడ్లు, విటమిన్ ఇ, కాల్షియం, ఫాస్పరస్, జింక్, కరిగే మరియు కరగని పీచు పదార్థం వంటివి ఎన్నో ఉంటాయి. న్యూట్రిషనిస్టుల ప్రకారం నానబెట్టిన బాదంపప్పు తినటం మాములు వాటికన్నా మరింత ఆరోగ్యకరం అని. ఎందుకంటే రాత్రంతా నానబెట్టిన బాదంపప్పులలో నీరు దాని తొక్కుపై ఉన్న విషపదార్థాలను తొలగించివేస్తుంది, ఫైటిక్ యాసిడ్ ను విడుదల చేస్తుంది మరియు గ్లూటెన్ పదార్థాలను విఛ్చిన్నం చేస్తుంది. అలా మీకు ఆ నట్లనుండి ఎక్కువ పోషకాలు అందుతాయి.మనం ఇప్పుడు పొద్దున్నే నానబెట్టిన బాదంపప్పులు తినటం వలన వచ్చే ఆరోగ్య లాభాలేంటో తెలుసుకుందాం.
జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది
నానబెట్టిన బాదంపప్పులు మొత్తం జీర్ణక్రియను సులభతరం చేసి వేగంగా జీర్ణప్రక్రియ సజావుగా సాగేలా చేస్తాయి. బాదంపప్పులను నీటిలో నానబెట్టినపుడు, పైన తొక్కు తీసేయడం వలన సులువుగా జీర్ణమై, ఎక్కువ పోషకాలు దాని నుంచి అందుతాయి.
మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది
డాక్టర్లు 4 నుంచి 6 బాదంపప్పులు రోజూ తినటం వలన మెదడుకి టానిక్ లాగా పనిచేసి, కేంద్రనాడీ వ్యవస్థ సరిగ్గా పనిచేసేలా చేస్తుంది. అందుకని, పొద్దున్నే బాదం తినటం వలన మీ జ్ఞాపకశక్తి చురుకుగా మారి, మెదడు పనితీరు మెరుగవుతుంది.
కొలెస్ట్రాల్ తగ్గుతుంది
నానబెట్టిన బాదంపప్పుల వలన కొలెస్ట్రాల్ ఎక్కువ శాతం తగ్గుతుంది. వీటిల్లో మోనోసాచ్యురేటడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉండి అవి శరీరంలోని చెడ్డ కొవ్వులను కరిగిస్తాయి. బాదంలలో ఉండే విటమిన్ ఇ రక్తప్రవాహంలోని మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతాయి.
రక్తపోటును మెరుగుపరుస్తాయి
మీకు తెలుసా నానబెట్టిన బాదంపప్పు అధిక రక్తపోటును నయం చేస్తాయని? నానబెట్టిన బాదంపప్పుల్లో ఉండే అధిక పొటాషియం మరియు తక్కువ సోడియం రక్తపోటు పెరగకుండా చూస్తాయి. వాటిల్లో ఫోలిక్ యాసిడ్ మరియు మెగ్నీషియం ఉండి రక్తనాళాలు నిండిపోకుండా ఆ రిస్క్ ను తగ్గిస్తాయి.
బరువు తగ్గటంలో సాయపడతాయి
మీ మొండి పొట్ట కొవ్వును కరిగించటానికి నానబెట్టిన బాదంలను మీ డైట్ లో జతచేసుకోండి. నానబెట్టిన బాదంపప్పులు పై తొక్కు తీసేయటం వలన బరువు తగ్గటం వేగతరం చేస్తాయి. నానబెట్టిన బాదంలలో మోనోసాచ్యురేటడ్ కొవ్వులుండి మీ ఆకలిని తగ్గించి, కడుపు నిండుగా ఉంచుతాయి.
రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది
ప్రముఖ అధ్యయనం ప్రకారం, నానబెట్టిన బాదంపప్పులు ప్రీబయాటిక్ ప్రభావం కలిగి ఉండి, రోగనిరోధక వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తాయి. ప్రీబయాటిక్ మీ ఆహారనాళంలో మంచి బ్యాక్టీరియా పెరగటానికి దోహదపడుతుంది మరియు దాని ఫలితంగా, అనేక వ్యాధులను నివారించటంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది.
The post నానబెట్టిన బాదంపప్పులు తినటం వల్ల లాభాలేంటో తెలుసా…? appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA http://bit.ly/2IWIhaU


No comments:
Post a Comment