7 రేస్ కోర్స్ రోడ్డు: కేసీఆర్ ప్రధానమంత్రి పదవిపై కన్నేశారా, చంద్రబాబుతో పోటీనా? | Telangana CM K Chandrasekhar Rao eyeing 7-RCR? Wants to be the changemaker on national stage కొత్త చర్చకు కేసీఆర్ వ్యాఖ్యలు ఆదివారం కేసీఆర్ మీడియా సమావేశంలో చెప్పిన తృతీయ కూటమి వ్యాఖ్యలు దేశ రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు తెరలేపాయి. దేశవ్యాప్తంగా టీఆర్ఎస్ విధానాలకు దగ్గరగా ఉండే పార్టీలను కలుపుకుని థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుకు కృషి చేస్తానని, అందుకు తానే నాయకత్వం వహిస్తానని కేసీఆర్ వెల్లడించారు.. కేసీఆర్ మాటలను విశ్లేషిస్తే జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలన్న ఆయన మనసులోని కోరిక కనిపిస్తోందని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. మోడీ దెబ్బతో గుబులు, నిన్న బాబు, నేడు కేసీఆర్-స్టాలిన్ హెచ్చరిక: దండయాత్రకు చెక్ కేసీఆర్‌పై ఆసక్తికరం జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు నేను సిద్ధమేనని, సమీప భవిష్యత్తులో జాతీయ రాజకీయ పరిస్థితులు మారనున్నాయని, మార్పును తీసుకువచ్చే బాధ్యతను తన భుజాలపై వేసుకునేందుకు కూడా సిద్ధమని, మరో మూడు నాలుగేళ్లలో మార్పు వస్తుందని కేసీఆర్ చెప్పడంపై ప్రముఖ ఆంగ్ల దిన పత్రిక న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్ ఆసక్తికర కథనం ఇచ్చింది. జనసేన పార్టీ కోసం పవన్ కళ్యాణ్ చేతికి ఆనాటి రూ.3 కోట్లు, టైంకు ఇచ్చిన మెగా బ్రదర్? మోడీపై విమర్శల దాడి ఇటీవలి కాలంలో ప్రధాని నరేంద్ర మోడీపై విమర్శల దాడిని కేసీఆర్ పెంచారని, ముఖ్యంగా రైతులకు మద్దతు ధర, రాష్ట్రానికి రావాల్సిన కేంద్ర సాయం, విభజన హామీల అమలు తదితరాల్లో కేంద్రం వైఫల్యం చెందిందని వ్యాఖ్యానిస్తున్నారని ఆ పత్రిక పేర్కొంది. కేసీఆర్ ఇప్పటికే తమిళనాడులోని డీఎంకేతో పాటు సమాజ్ వాదీ పార్టీ, జేడీఎస్ తదితరాలతో చర్చిస్తున్నట్టు తెలుస్తోందని పేర్కొంది. ఢిల్లీలోని 7 రేస్ కోర్సు రోడ్డుపై కన్నేశారా ఢిల్లీలోని 7 రేస్ కోర్స్ రోడ్డుపై కేసీఆర్ కన్నేశారా అని హెడ్డింగ్ పెట్టి.. ప్రధానమంత్రి పదవిని అలంకరించాలన్న కోరిక ఆయనలో ఉన్నట్లుగా కనిపిస్తోందని అభిప్రాయపడింది. తన ప్రత్యర్థి చంద్రబాబుతోనూ మాట్లాడతానని కేసీఆర్ చెప్పారని, కాలం కలిసి వస్తే తృతీయ కూటమిలోకి తృణమూల్ కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, ఆర్జేడీ వంటి పార్టీలు కూడా చేరే అవకాశాలు ఉన్నాయని అంచనా వేసింది. మరో ట్విస్ట్ చంద్రబాబు కంటే ముందుగా.. కేంద్రంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఏపీ టీడీపీ నేతలు ఇటీవల పలుమార్లు అవసరమైతే చంద్రబాబు కేంద్రంలో చక్రం తిప్పుతారని, మరో ఫ్రంట్ కోసం ప్రయత్నాలు చేస్తారని బీజేపీకి హెచ్చరికలు జారీ చేశారు. చంద్రబాబుతో ప్రతి విషయంలో పోటీ పడినట్లుగా కనిపించే కేసీఆర్.. ఆ కోణంలోను బాబుతో పోటీ పడే ప్రయత్నం చేస్తున్నారా అనే చర్చ కూడా సాగుతోంది. The post 7 రేస్ కోర్స్ రోడ్డు: కేసీఆర్ ప్రధానమంత్రి పదవిపై కన్నేశారా, చంద్రబాబుతో పోటీనా? | Telangana CM K Chandrasekhar Rao eyeing 7-RCR? Wants to be the changemaker on national stage appeared first on Etechlooks. http://bit.ly/2IW2Mp5
Friday, May 3, 2019
Home
Unlabelled
7 రేస్ కోర్స్ రోడ్డు: కేసీఆర్ ప్రధానమంత్రి పదవిపై కన్నేశారా, చంద్రబాబుతో పోటీనా? | Telangana CM K Chandrasekhar Rao
7 రేస్ కోర్స్ రోడ్డు: కేసీఆర్ ప్రధానమంత్రి పదవిపై కన్నేశారా, చంద్రబాబుతో పోటీనా? | Telangana CM K Chandrasekhar Rao
Share This
About etechlooks
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment