Fani cyclone landfall: Odisha Cyclone Landfall: తీరం దాటిన ఫణి.. ఒడిశాలో బీభత్సం – cyclone fani landfall process completed in puri; strong wind expected to continue పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన పెను తుఫాను‘ఫణి’ శుక్రవారం ఉదయం 10.30 గంటల తర్వాత పూరీ సమీపంలో తీరం దాటింది. ఉదయం 8.30 తర్వాత తీరాన్ని తాకిన ఫణి రెండు గంటల అనంతరం తీరం దాటినట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. గంటకు 22కిలోమీటర్ల వేగంతో కదులుతున్న ఈ పెను తుఫాను గోపాలపూర్-చాంద్‌బలీ వద్ద పూర్తిగా తీరం దాటి పశ్చిమ్ బెంగాల్ మీదుగా బంగ్లాదేశ్ వైపు పయనిస్తోంది. ప్రస్తుతం తుఫాను ప్రభావంతో గంటలకు 200-240 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. బంగ్లాదేశ్‌లోకి ప్రవేశించే లోపే తుఫాను బలహీనపడతుందని వాతావరణశాఖ తెలిపింది. బాలాసోర్ వద్ద మళ్లీ సముద్రంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తోంది. ఫణి తీరం దాటడంతో ఒడిశా రాజధాని భువనేశ్వర్ సహా పలు ప్రాంతాల్లో ప్రచండ గాలులు వీస్తున్నాయి. కొన్ని చోట్ల భారీ వృక్షాలు నేలకొరిగాయి. చదవండి: పూరీ వద్ద తీరం తాకిన ఫణి.. సిక్కోలుకు తప్పిన ముప్పు పూరీ పరిసర ప్రాంతాల్లో కుంభవృష్టి కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గంజాం జిల్లాల్లో పెను గాలులు, భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల పూరి గుడిసెలు, చెట్లు కుప్పకూలాయి. తుఫాను తీరం దాటినా మరో 24 గంటల పాటు దీని ప్రభావం ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ సమయంలో ఉత్తరాంధ్ర జిల్లాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరోవైపు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లోని తీరంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. అలలు సాధారణం కంటే ఒకటిన్నర మీటర్ల ఎత్తున ఎగిసిపడుతున్నాయి. కళింగ పట్నం పోర్టులో పదో నెంబరు ప్రమాద హెచ్చరికలు, విశాఖ, గంగవరం పోర్టుల్లో ఎనిమిదో నెంబరు, మచిలీపట్నం, కృష్ణపట్నం పోర్టుల్లో మూడో నెంబరు ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయి. చదవండి: ఫణి ప్రభావంతో చిగురుటాకులా వణికిన శ్రీకాకుళం తూర్పు కోస్తా రైల్వే మొత్తం 107 రైళ్లను రద్దు చేయడంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. రైళ్ల రద్దుతో విశాఖ రైల్వే స్టేషన్‌లో పరిసర ప్రాంతాల ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. భువనేశ్వర్ నుంచి నడిచే కొణార్క్ ఎక్స్‌ప్రెస్ నిలిపివేయడంతో విశాఖ నుంచి ముంబైకి ప్రత్యేక రైలు నడుపుతున్నారు. విశాఖలో ఈ రైలు శుక్రవారం రాత్రి 10.35కి బయలుదేరి శనివారం ఉదయం 5.20 కి విజయవాడ, ఉదయం 11.40కి సికింద్రాబాద్ చేరుకుంటుందని రైల్వే అధికారులు తెలిపారు. దీనిని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని రైల్వే అధికారులు వెల్లడించారు. చదవండి: ఇరవైఏళ్ల తర్వాత అతిపెద్ద తుఫాను.. ఫణి ఇక, బంగ్లాదేశ్‌కన్నా ముందు ఫణి తుఫాను కోల్‌కతాను తాకే అవకాశముండటంతో బెంగాల్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. మరోవైపు తుఫాను నేపథ్యంలో వివిధ ప్రాంతాల్లో తీర ప్రాంత రక్షణ దళం 34 సహాయక బృందాలను ఏర్పాటు చేసింది. తుఫాను ప్రభావం తెలుసుకోవాలని వాయుసేన విమానాలను సిద్ధం చేసింది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ హెల్ప్‌లైన్ నంబర్ 1938ను ఏర్పాటు చేసింది. చదవండి: ఫణి ఎఫెక్ట్.. అప్రమత్తమైన పశ్చిమ్ బెంగాల్ The post Fani cyclone landfall: Odisha Cyclone Landfall: తీరం దాటిన ఫణి.. ఒడిశాలో బీభత్సం – cyclone fani landfall process completed in puri; strong wind expected to continue appeared first on Etechlooks. http://bit.ly/2J8Jb4h
Friday, May 3, 2019
Home
Unlabelled
Fani cyclone landfall: Odisha Cyclone Landfall: తీరం దాటిన ఫణి.. ఒడిశాలో బీభత్సం - cyclone fani landfall process completed in puri; strong wind expected to continue | Etechlooks
Fani cyclone landfall: Odisha Cyclone Landfall: తీరం దాటిన ఫణి.. ఒడిశాలో బీభత్సం - cyclone fani landfall process completed in puri; strong wind expected to continue | Etechlooks
Share This
About etechlooks
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment