etechlooks

Daily Latest news Channel

Breaking

Wednesday, May 15, 2019

సంచలన విషయాన్ని బయటపెట్టిన టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్, అదేంటో తెలుసా …?

మే 10వ తేదీన టీవీ9 కార్యాలయంలోకి రోజూ మాదిరిగానే వెళుతున్న రవిప్రకాష్‌ను పోలీసులు అడ్డుకున్నారు. లోపల వాటాదారుల సమావేశం జరుగుతోందని, బలవంతంగా కార్యాలయంలోకి వెళ్లాలని ప్రయత్నిస్తే కస్టడీలోకి తీసుకుంటామని రవిప్రకాష్‌కు పోలీసులు బదులిచ్చారు. అనంతరం టీవీ9 సీఈవో బాధ్యతల నుంచి రవిప్రకాష్‌ను కొత్త యాజమాన్యం తొలగించడం, కొత్త సీఈవోను ప్రకటించడంతో టీవీ9తో రవిప్రకాష్‌కు ఉన్న అనుబంధం దాదాపుగా తెగిపోయింది. అప్పటి నుంచి రవిప్రకాష్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. పోలీసులు విచారణకు హాజరుకావాలని నోటీసులు పంపినా స్పందిచలేదు. పోలీసులు ఆయన కోసం గాలిస్తున్నారు. నేడు విచారణకు హాజరుకాని పక్షంలో అరెస్ట్ తప్పదనే ప్రచారం కూడా జరుగుతోంది.

ఈ నేపథ్యంలో ఓ మీడియా సంస్థకు రవిప్రకాష్ అజ్ఞాతం నుంచే ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆయన ఎక్కడున్నారో తెలియదు గానీ ఆయన ఇంటర్వ్యూలో పలు కీలక విషయాలను బయటపెట్టారు. మై హోం రామేశ్వరరావు 2016లోనే టీవీ9ను దక్కించుకోవాలన్న ఉద్దేశంతో తమను సంప్రదించినట్లు రవిప్రకాష్ చెప్పారు. అయితే.. అందుకు తాను అందుకు అంగీకరించలేదని ఆయన తెలిపారు. రామేశ్వరరావు ఆలోచన వెనుక రాజకీయ అజెండా ఉందని, పైగా ఆయన తెలంగాణ ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడని రవిప్రకాష్ చెప్పుకొచ్చారు. అంతేకాకుండా, ఆయన చినజీయర్ స్వామి అనుచరుడని తెలిపారు. తన రాజకీయ, సైద్ధాంతిక సిద్ధాంతాలను జొప్పించే ఉద్దేశంతో టీవీ9ను టేకోవర్ చేసుకోవాలని భావించారని, అందుకే తాను ఆ ప్రతిపాదనకు ఒప్పుకోలేదని రవిప్రకాష్ చెప్పారు.

2018 సెప్టెంబర్‌లో కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డిపై ఐటీ రైడ్స్ జరిగినప్పుడు తాను అమెరికాలో ఉన్నానని, ఆ సమయంలో తనకు న్యూస్‌రూమ్ నుంచి కాల్ వచ్చిందని రవిప్రకాష్ చెప్పారు. రేవంత్ రెడ్డి వార్తను ఎలా కవర్ చేయాలో రామేశ్వరరావు కుమారుడు, సోదరుడు డిక్టేట్ చేస్తున్నారని ఫోన్‌ చేసి తన స్టాఫ్ చెప్పినట్లు రవిప్రకాష్ ఇంటర్వ్యూలో వెల్లడించారు. రేవంత్ రెడ్డి వారికి రాజకీయ శత్రువు కావడంతో, ఆయనను రాజకీయంగా దెబ్బ తీసేందుకు వారు ప్రయత్నించారని రవిప్రకాష్ చెప్పారు.

The post సంచలన విషయాన్ని బయటపెట్టిన టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్, అదేంటో తెలుసా …? appeared first on DIVYAMEDIA.



from DIVYAMEDIA http://bit.ly/2HlCElf

No comments:

Post a Comment